ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్-2023లో భాగంగా ఇండియా 'ఏ'తో జరుగుతోన్న ఫైనల్ పోరులో పాక్ బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. టీ20 తరహాలో ధనాధన్ బ్యాటింగ్ చేస్తూ బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. ఆది నుంచే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పాక్ యువ ఆటగాళ్లు.. ఎడా పెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు.
ఆ జట్టు ఓపెనర్లు సయ్యిమ్ అయూబ్(59; 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు), షాహిబ్జాదా ఫర్హాన్(65; 62 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. 25 ఓవర్లు ముగిసేసరికి పాక్ 2 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. వికెట్ల కోసం భారత బౌలర్లు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
Quick off the blocks ?
— Pakistan Cricket (@TheRealPCB) July 23, 2023
Timely performance in the final by @SaimAyub7.#ACCMensEmergingTeamsAsiaCup | #BackTheBoysInGreen pic.twitter.com/oqejAg3qtE
.@RealSahibzada dictating terms with a quality knock ?#ACCMensEmergingTeamsAsiaCup | #BackTheBoysInGreen pic.twitter.com/7vxmpR2oBb
— Pakistan Cricket (@TheRealPCB) July 23, 2023
కాగా ఇరు జట్ల మధ్య లీగ్ దశలో జరిగిన పోరులో భారత్ పైచేయి సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాక్ ను 8 వికెట్ల తేడాతో మట్టికరిపించింది.