మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో అఫ్ఘనిస్తాన్.. భారత్ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆల్ రౌండర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్(29; 22 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్), మహ్మద్ నబీ(42; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లు) బ్యాట్ ఝుళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
ఆదుకున్న ఒమర్జాయ్-నబీ
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘన్ జట్టుకు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(23), ఇబ్రహీం జద్రాన్(25) అముఞ్చి ఆరంభాన్ని ఇచ్చారు. నిదానంగా ఆడిన తొలి వికెట్ కు 50 పరుగులు జోడించారు. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో అఫ్ఘన్ ఇన్నింగ్స్ మందకొడిగా సాగింది. ఆల్ రౌండర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్(29; 22 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్), మహ్మద్ నబీ(42; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును ఆదుకున్నారు.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముఖేశ్ కుమార్.. చెరో 2 వికెట్లు పడగొట్టగా.. శివమ్ దూబే ఒక వికెట్ తీసుకున్నారు.
Nabi helps Afghanistan recover from Axar's early pressure - but will 158/5 be enough in Mohali? #INDvAFG
— ESPNcricinfo (@ESPNcricinfo) January 11, 2024
▶️ https://t.co/h8T9TDJRmL pic.twitter.com/1ITK72hMEl