IND vs AFG 2nd T20I: విరాట్‌‌‌‌‌‌‌‌ ఆగయా.. నేడు అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌తో ఇండియా రెండో టీ20

IND vs AFG 2nd T20I: విరాట్‌‌‌‌‌‌‌‌ ఆగయా.. నేడు అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌తో ఇండియా రెండో టీ20
  • సిరీస్‌‌‌‌‌‌‌‌పై గురిపెట్టిన టీమిండియా
  • లెక్క సరిచేసేందుకు అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ ప్రయత్నాలు
  • రా. 7 నుంచి స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ 18,  జియో సినిమాలో

ఇండోర్‌ ‌‌‌‌‌‌:  టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు ముందు ఆడుతున్న చివరి షార్ట్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌పై టీమిండియా గురి పెట్టింది. దీంతో ఆదివారం అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌తో జరిగే రెండో పోరులోనూ గెలవాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో 1–0 లీడ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఇండియా ఇక్కడే సిరీస్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకోవాలని ప్లాన్స్ వేస్తోంది. ఈ నేపథ్యంలో తొలి టీ20లో ఎదురైన బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ సమస్యలకు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టాలని కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ భావిస్తున్నాడు. దాదాపు 14 నెలల తర్వాత కింగ్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ మళ్లీ షార్ట్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో ఆడుతుండటం ఇండియాకు అతిపెద్ద బలంగా మారింది. మొత్తానికి జూన్‌‌‌‌‌‌‌‌లో జరిగే మెగా వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు రోహిత్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ అందుబాటులో ఉంటారనే స్పష్టమైన సంకేతాలైతే అందుతున్నాయి. ఇక ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌లో యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌గా ఉంటే శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగొచ్చు. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో డకౌటైన హిట్‌‌‌‌‌‌‌‌మ్యాన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ ఇందులో భారీ స్కోరుపై కన్నేశాడు. తెలుగు బ్యాటర్‌‌‌‌‌‌‌‌ తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మకు చాన్స్‌‌‌‌‌‌‌‌ లేనట్లే. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ శివమ్‌‌‌‌‌‌‌‌ దూబె ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనూ కీలకం కానున్నాడు. వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకోవాలని భావిస్తున్న జితేష్‌‌‌‌‌‌‌‌ శర్మ లోయర్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లో ఉపయుక్తమైన బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా మారటం ఇండియాకు కలిసొచ్చే అంశం. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లుగా వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌పై మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ మరిన్ని ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఈ ఇద్దరు భారీ స్కోర్లు చేస్తే రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు దక్కుతాయి. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో భారీగా రన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చుకున్న స్పిన్నర్​ రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో కుల్దీప్‌‌‌‌‌‌‌‌కు అవకాశం ఇవ్వొచ్చు. ఇద్దరు పేసర్లుగా అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌, ముకేశ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లు ఖాయం. ఇండోర్‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు అనుకూలం. షార్ట్‌‌‌‌‌‌‌‌ బౌండ్రీస్‌‌‌‌‌‌‌‌ ఉండటంతో బౌలర్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. 

హజ్రతుల్లాకు చాన్స్‌‌‌‌‌‌‌‌

సిరీస్‌‌‌‌‌‌‌‌ చేజారకుండా చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ కూడా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కోసం అన్ని రకాలుగా సిద్ధమైంది. హజ్రతుల్లా జజాయ్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌గా ఉంటే రహమత్‌‌‌‌‌‌‌‌ షా ప్లేస్‌‌‌‌‌‌‌‌లో తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. యంగస్టర్స్‌‌‌‌‌‌‌‌ రహమానుల్లా గుర్బాజ్‌‌‌‌‌‌‌‌, అజ్మతుల్లా ఒమర్‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌ నబీ చెలరేగితే భారీ స్కోరును ఆశించొచ్చు. స్టార్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రషీద్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ లేకపోవడం ప్రతికూలాంశం. అయితే ముజీబ్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం బలంగా మారింది. నవీన్‌‌‌‌‌‌‌‌, షారూకీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో రాణిస్తే ఇండియాను తక్కువ స్కోరుకే కట్టడి చేయొచ్చు. 

జట్లు (అంచనా)

ఇండియా: రోహిత్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ / శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌, విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ, శివమ్‌‌‌‌‌‌‌‌ దూబె, రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌, జితేష్‌‌‌‌‌‌‌‌ శర్మ, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, సుందర్‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ / రవి బిష్ణోయ్‌‌‌‌‌‌‌‌, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, ముకేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ / అవేశ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌. 

అఫ్గానిస్తాన్‌: ఇబ్రహీం (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), రహమానుల్లా, హజ్రతుల్లా జజాయ్‌‌‌‌‌‌‌‌ / రహమత్‌‌‌‌‌‌‌‌ షా, అజ్మతుల్లా ఒమర్‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌‌‌‌‌, మహ్మద్‌‌‌‌‌‌‌‌ నబీ, నజీబుల్లా జద్రాన్‌‌‌‌‌‌‌‌, కరీమ్‌‌‌‌‌‌‌‌ జనత్‌‌‌‌‌‌‌‌, గుల్బాదిన్‌‌‌‌‌‌‌‌ నబీ, ముజీబ్‌‌‌‌‌‌‌‌, నవీన్‌‌‌‌‌‌‌‌ ఉల్‌‌‌‌‌‌‌‌ హల్‌‌‌‌‌‌‌‌, ఫజల్‌‌‌‌‌‌‌‌హక్‌‌‌‌‌‌‌‌ ఫారూకీ.

35 టీ20ల్లో 12 వేల రన్స్‌‌‌‌‌‌‌‌  

(ఐపీఎల్​తో కలిపి) చేసిన తొలి ఇండియన్​ క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కేందుకు విరాట్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన రన్స్‌‌‌‌‌‌‌‌. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా ఈ ఫీట్‌‌‌‌‌‌‌‌ సాధించిన నాలుగో ప్లేయర్‌‌‌‌‌‌‌‌గానూ రికార్డు సొంతం చేసుకుంటాడు.