జైస్వాల్ 4, దూబే ఒక్క పరుగు.. కోహ్లీ, శాంసన్ డకౌట్లు.. ఇదీ భారత జట్టు తొలి 4 ఓవర్లలో ప్రదర్శన. ఈ దశలో టీమిండియా గెలుపు గురించి పక్కనపెడితే 150 స్కోరైనా దాటుతుందా..! అన్నది అందరి మదిలో తోచిన ప్రశ్న. కానీ ఆ అనుమానాలను భారత కెప్టెన్ రోహిత్(121 నాటౌట్) శర్మ పటాపంచలు చేశాడు. ఓవైపు నిలకడగా ఆడుతూనే మరోవైపు ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన హిట్ మ్యాన్ కీలక సమయంలో బ్యాట్ ఝుళిపించాడు. ఒక వైపు సహచర బ్యాటర్లు వెనుదిరుగుతున్నా.. తాను మాత్రం అడ్డుగోడలా నిలబడి భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 121 పరుగులు చేశాడు. అతనికి రింకూ సింగ్(69 నాటౌట్; 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్ లు) చక్కని సహకారం అందించాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫరీద్ మాలిక్ 3 వికెట్లు పడగొట్టగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ తీసుకున్నారు.
? Milestone Alert ?
— BCCI (@BCCI) January 17, 2024
Most T20I hundreds in Men's cricket! ? ?
Take. A. Bow Rohit Sharma ? ?
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/J0hALcdhuF
రివర్స్ స్వీప్ సిక్స్
రోహిత్ శర్మ సిక్సులంటే అందరికి గుర్తొచ్చేది.. అతని ఫుల్ షాట్లు. అలాంటిది హిట్‌మ్యాన్ తన 17 ఏళ్ల టీ20 కెరీర్‌లో ఎన్నడూ చూడని రివర్స్ స్వీప్ సిక్స్ మలిచాడు. ఆ షాట్ ఆడగానే స్టేడియం ప్రేక్షకుల కేరింతలతో దద్ధరిల్లింది.
The outrageous reverse sweep of captain Rohit Sharma. ??pic.twitter.com/C19DIhseRk
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2024