చిన్నస్వామి స్టేడియం వేదికగా అఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఆఖరి టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(121 నాటౌట్; 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. టాపార్డర్ విఫలమైనా రింకూ సింగ్ సహకారంతో ఒక్కడే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఓవైపు నిలకడగా ఆడుతూనే మరోవైపు ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. దీంతో టీమిండియా 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే, ఈ మ్యాచ్ మధ్యలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
అర్రే వీరూ,.. రోహిత్ శర్మ
రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ బంతి అతని బ్యాట్ ను తగలగా.. ఆన్ ఫీల్డ్ అంపైర్ వీరేందర్ శర్మ లెగ్ బైస్‌గా సిగ్నలిచ్చాడు. దీంతో అవతలి ఎండ్‍కు చేరుకున్న హిట్ మ్యాన్.. లెగ్ బైస్ కాదని బ్యాటింగ్ తగిలిందని అంపైర్‌కు సూచించాడు. " అర్రే వీరూ, (లెగ్-బై దియా తా సెకండ్ బాల్? ఇట్నా బడా బ్యాట్ లగా..) లెగ్ బైస్ అంటావేంటి.. ఇంత పెద్ద బ్యాట్ తగులుతుంటే..! అసలే గత రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యా.. కొట్టిన పరుగులు ఇవ్వకపోతే ఎలా అంటూ నవ్వుతూ అతనితో సంభాషించాడు.." ఆ మాటలు స్టంప్ మైక్ లో రికార్డవ్వడంతో నెట్టింట వైరల్ గా మారాయి.
Classic Rohit Sharma ...!!! ??
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2024
- He's telling umpire that there's big bat and not leg byes and also saying he scored 2 ducks - went on to score a remarkable century. ?pic.twitter.com/5lMJAFqVGX