సొంతగడ్డపై, తనకు అచ్చొచ్చిన వేదికపై భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులను నిరాశపరిచాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఆఖరి టీ20లో కోహ్లీ(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. దీంతో భారత జట్టు ఆదిలోనే కష్టాల్లో పడింది. విరాట్ డకౌట్ అవ్వడం అంతర్జాతీయ టీ20ల్లో ఇదే తొలిసారి.
ఫరీద్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ రెండో బంతికి యశస్వి జైస్వాల్(4) వెనుదిరగ్గా.. అతని స్థానంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(0) ఆ మరుసటి బంతికే ఔటయ్యాడు. అనంతరం కొద్దిసేపటికే శివమ్ దూబే(1), సంజూ శాంసన్(0) కూడా పెవిలియన్ చేరడంతో టీమిండియా.. 22 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి రోహిత్ శర్మ(27 నాటౌట్), రింకూ సింగ్(19 నాటౌట్) జోడి భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 10 ఓవర్లు ముగిసేసరికి 61/4.
One brings two for Afghanistan
— CricTracker (@Cricketracker) January 17, 2024
Virat Kohli departs for a duck.
?: Jio Cinema pic.twitter.com/gXPRwm989A