వన్డే ప్రపంచకప్ 2023 భాగంగా.. భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. హష్మతుల్లా షాహిది (80), అజ్మతుల్లా ఒమర్జాయ్(62) హాఫ్ సెంచరీలు బాదారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయ లక్ష్యం 273 పరుగులు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్ఘనిస్తాన్ 63 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. అఫ్ఘాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్(22)ను బుమ్రా పెవిలియన్ చేర్చగా.. రహ్మత్ షా(16)ను శార్దూల్ ఠాకూర్, రహ్మానుల్లా గుర్బాజ్(21)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశారు. అనంతరం ఒమర్జాయ్-హష్మతుల్లా జోడి నాలుగో వికెట్ కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మొదటలో ఆచి తూచి ఆడిన వీరిద్దరూ క్రీజులో కుదుకున్నాక భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. నలుమూలలా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
??: Snapshots from our batting innings, as we posted 272/8 runs in the first inning. ?#AfghanAtalan | #CWC23 | #AFGvIND | #WarzaMaidanGata pic.twitter.com/GhOfhMiVgs
— Afghanistan Cricket Board (@ACBofficials) October 11, 2023
వీరిద్దరి ధాటికి ఒకానొక సమయంలో జట్టు స్కోర్ మూడొందల దాటుతుంది అనుకున్నప్పటికీ.. వీరు ఔట్ అయ్యాక త్వరగానే ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీసుకోగా.. హార్దిక్ పాండ్యా 2, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు.
ALSO READ : Cricket World Cup 2023: ఇండియా - పాక్ మ్యాచ్ రోజే నరేంద్ర మోడీ స్టేడియాన్ని పేల్చేస్తాం.. బీసీసీఐకి మెయిల్
Jasprit Bumrah helps himself to his best @cricketworldcup figures with an exceptional display in Delhi ?#CWC23 #INDvAFG pic.twitter.com/kNrq871KWv
— ICC (@ICC) October 11, 2023