పొట్టి ప్రపంచకప్ లీగ్ దశను విజయవంతంగా ముగించిన రోహిత్ సేన.. సూపర్ -8 సమరానికి సిద్ధమైంది. గురువారం(జూన్ 20) తొలి పోరులో ఆఫ్గనిస్తాన్తో తలపడుతోంది. కెన్సింగ్టన్ ఓవల్(బార్బడోస్) వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్లో భారత జట్టు సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
సెకండ్ ఇన్నింగ్స్ సమయానికి బ్యాటర్లకు కష్టమవుతుందన్న ఆలోచనతో మొదట బ్యాటింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ వెల్లడించాడు. ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ సైతం.. తాము టాస్ గెలిచినా బ్యాటింగ్ ఎంచుకునేవారిమని తెలిపాడు. భారత జట్టులో ఒక మార్పు జరిగింది. సిరాజ్ స్థానంలో కుల్దీప్ జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫజల్హాక్ ఫరూకీ.
🚨 Toss & Team Update 🚨
— BCCI (@BCCI) June 20, 2024
Captain Rohit Sharma has won the toss & #TeamIndia have elected to bat against Afghanistan.
1⃣ change in our Playing XI as Kuldeep Yadav is named in the team.
Follow The Match ▶️ https://t.co/xtWkPFaJhD #T20WorldCup | #AFGvIND pic.twitter.com/QlcAJ0MMkd