భారత్ తడబ్యాటు : అఫ్ఘాన్ టార్గెట్-225

భారత్ తడబ్యాటు : అఫ్ఘాన్ టార్గెట్-225

సౌతాంప్టన్:  అఫ్ఘనిస్థాన్ జరుగుతున్న మ్యాచ్ లో భారత్ తక్కువ స్కోర్ కే పరిమితమైంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 224 రన్స్ చేసింది భారత్. టాస్ గెలిలి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియాకు మంచి ప్రారంభం దక్కలేదు. హిట్ మ్యాన్ రోహిత్ ఔట్ కావడంతో తర్వాత వచ్చిన ప్లేయర్లను కట్టడి చేశారు అఫ్ఘన్ బౌలర్లు. చిన్న టీమ్ తో ఆడుతున్న భారత్ భారీ స్కోర్ చేస్తుందనుకున్న క్రమంలో తక్కువ స్కోర్ కే పరిమితమైంది టీమిండియా. కెప్టెన్ కోహ్లీ, జాదవ్ మాత్రమే హాఫ్ సెంచరీలతో రాణించగా..మిగతా ప్లేయర్లు తక్కువ రన్స్ కే పెవిలియన్ బాట పట్టారు.

భారత్ ప్లేయర్లలో..కోహ్లీ(67), కేదార్ జాధవ్(52) లోకేష్ రాహుల్(30), విజయ్ శంకర్(29), ధోనీ(28) ఎక్కు వ రన్స్ చేశారు.

అఫ్ఘాన్ బౌలర్లలో..నబీ, గుల్బాదిన్ నయబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, రహ్మత్ షా, ముజీబ్, అప్తాబ్ అలామ్ తలో వికెట్ తీశారు.