ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ పూనకం వచ్చిన ఆడుతున్నాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ ఆఫ్ఘన్ ఫీల్డర్లు ఆకాశం వైపు తలెత్తుకునేలా చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్(100).. సిక్సర్లతో వెస్టిండీస్ భారత క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును, సెంచరీతో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డు బద్ధులుకొట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు కొత్త బాస్
ఈ మ్యాచ్‌లో ఇప్పటివరకూ 4 సిక్సర్లు బాదిన రోహిత్.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్ గా చరిత్రకెక్కాడు. గత మ్యాచ్ వరకూ ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మూడు సిక్సులు బాదడంతో.. ఈ అరుదైన రికార్డు అతని ఖాతాలో చేరింది. గేల్ 551 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 553 సిక్సులు కొట్టగా.. రోహిత్ 472 మ్యాచ్‌ల్లో 554 సిక్సులు బాదాడు.
ALSO READ : ICC World Cup 2023: రోహిత్ శర్మ నువ్ కేక.. వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత ఫాస్టెస్ట్ రికార్డు
అంతర్జాతీయ క్రికెట్లో సిక్సర్ల వీరులు:
- రోహిత్ శర్మ: 554
- క్రిస్ గేల్: 551
- షాహిద్ అఫ్రిదీ: 476
- బ్రెండన్ మెకల్లమ్: 389
- మార్టిన్ గప్టిల్: 383
సచిన్ సెంచరీల రికార్డు బద్దలు
మరోవైపు, ఈ సెంచరీతో హిట్ మ్యాన్.. సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే ప్రపంచ కప్‌లలో అత్యధిక సెంచరీలు(7) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గత మ్యాచ్ వరకూ ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్(6) పేరిట ఉండేది.
వన్డే ప్రపంచ కప్‌లలో అత్యధిక సెంచరీల వీరులు:
- రోహిత్ శర్మ: 7
- సచిన్ టెండూల్కర్: 6
- కుమార సంగార్కర: 5
- రికీ పాంటింగ్: 5
- డేవిడ్ వార్నర్: 4
- సౌరవ్ గంగూలీ: 4
THE ROHIT SHARMA EFFECT IN DELHI ?
— CricTracker (@Cricketracker) October 11, 2023
?: Disney + Hotstar pic.twitter.com/Q03iPD5T0v