ఐసీసీ మెగా సమరానికి(వన్డే వరల్డ్ కప్ 2023) మరో రెండు వారాల సమయం మాత్రమే మిగిలివుంది. ఈ సమయంలో సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు స్వదేశంలో.. పటిష్ఠ ఆస్ట్రేలియాను ఢీకొడుతోంది. తమ అస్త్రశస్త్రాలను సరిచూసుకునేందుకు ఇరు జట్లకు ఈ మూడు వన్డేల సిరీస్ చక్కటి అవకాశం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అవకాశాల్ని ఆసీస్ చేజేతులా అందిపుచ్చుకుంటుంటే.. భారత్ మాత్రం మరోసారి ప్రయోగాలే వైపే అడుగులు వేసింది.
ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు వన్డేల నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రోహిత్ గైర్హాజరీతో కేెఎల్ రాహుల్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు.
భారత్ వ్యూహాలేంటి..?
మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాహుల్.. మహమ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టినట్లు వెల్లడించాడు. ఈ విషయంలో జట్టు వ్యూహాలేంటో అభిమానులకు అంతుపట్టడం లేదు. ఫామ్‌లో ఉన్న సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వడంతోపాటు షమీకి అవకాశం ఇవ్వడమే టీం మేనేజ్‌మెంట్ నిర్ణయమైతే వ్యతిరేక ఫలితాలు వస్తే మాటేంటన్నది అంతుచిక్కని ప్రశ్న.
రోహిత్, కోహ్లి, పాండ్యాలాంటి వారిని పక్కన పెట్టడంతో బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉంది. దీనికి తోడు సిరాజ్‌ను కూడా పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదన్నది విశ్లేషకుల మాట. ప్రపంచకప్ కు ముందు జరిగే సిరీస్ కనుక.. ఇందులో గెలిస్తే మరింత ఉత్సాహంతో ప్రపం చకప్ బరిలోకి దిగొచ్చు. కానీ, ఈ ప్రయోగాలు ఎటు దారితీస్తాయో అంతుపట్టడం లేదు. ఆసియా కప్ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సీనియ ర్లకు విశ్రాంతినిస్తే ఏం జరిగిందో చూశాం. అలాంటి ఫలితాలు మరోసారి పునరావృతం కాకూడదని కోరుకుందాం..