IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. పటిష్ట స్థితిలో టీమిండియా

IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. పటిష్ట స్థితిలో టీమిండియా

పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే అలౌటైన భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా రాణిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 46 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుంటే.. 212 పరుగుల లీడ్‌లో ఉంది.

ఇద్దరే నిలబెట్టారు..

భారత ఓపెన‌ర్లు జైస్వాల్ (90 నాటౌట్), రాహుల్(62 నాటౌట్) ఇద్దరూ క్రీజులో పాతుకుపోయారు. ఆసీస్ పేసర్లు ఎన్ని ఎత్తుగడలు వేసినా.. ఈ జోడీని విడగొట్టలేకపోయారు. ఆదిలో జైస్వాల్ కాస్త తడబడినట్లు కనిపించినా.. క్రీజులో కుదురుకున్నాక ఆసీస్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. ఓపెన‌ర్లు ఇద్దరూ అర్థ శ‌త‌కాలు సాధించారు. ప్రస్తుతం జైస్వాల్ 90, రాహుల్ 62 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మూడో రోజు ఆటలో ఈ జంట మరో సెషన్ క్రీజులో నిలదొక్కుకుంటే.. కంగారూలకు కష్టాలు తప్పవు.

ALSO READ | IPL 2025: ఐపీఎల్ వేలానికి కౌంట్‌డౌన్ స్టార్ట్.. చితక్కొట్టిన శ్రేయాస్ అయ్యర్

స్కోర్లు

టీమిండియా మొదటి ఇన్నింగ్స్: 150 ఆలౌట్
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 104 ఆలౌట్
టీమిండియా రెండో ఇన్నింగ్స్: 172/0 ( జైస్వాల్ 90 నాటౌట్, రాహుల్ 62 నాటౌట్)