IND vs AUS: సూర్య ప్రతాపం: వరుసగా నాలుగు సిక్సులు

IND vs AUS: సూర్య ప్రతాపం: వరుసగా నాలుగు సిక్సులు

వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీ ముంగిట ఆస్ట్రేలియా బౌలర్లు విధ్వంసాన్ని చవిచూస్తున్నారు. ఇండోర్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న  రెండో వన్డేలో భారత బ్యాటర్ల జోరుకు ఆసీస్ బౌలర్లు తేలిపోతున్నారు. 

ఈ మ్యాచ్‌లో శుభ్ మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలతో చెలరేగడం ఒక ఎత్తైతే.. మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ మరో ఎత్తు. వినూత్న షాట్లతో హోరెత్తించే సూర్య కంగారూలకు తన సత్తా ఏంటో చూపెడుతున్నాడు. మొదట్లో కాస్త ఆచి తూచి ఆడినట్లు కనిపించిన సూర్య.. కామెరూన్ గ్రీన్ వేసిన 44 ఓవర్‌లో మొదటి నాలుగు బంతులకు వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు.ఈ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు వచ్చాయి. సూర్యుడి మెరుపులు ధాటికి స్టేడియం హోరెత్తిపోయింది.

గిల్, అయ్యర్ సెంచరీల జోరు

అంతకుముందు భారత యువ ఓపెనర్ శుభ్‌మ‌న్ గిల్‌(104) సెంచ‌రీ బాదాడు. 93 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో గిల్ సెంచరీ మార్క్ చేసురుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో గిల్‌కు ఇది ఆరో శ‌త‌కం కాగా, ఈ ఏడాదిలో ఐదవది. అలాగే, జట్టులోకి వస్తూ పోతు ఉండే శ్రేయ‌స్ అయ్య‌ర్‌(105) కూడా సెంచరీ బాదాడు. వీరిద్దరూ క‌లిసి రెండో వికెట్‌కు రికార్డు స్థాయిలో 200 ప‌రుగులు జోడించారు.