బర్సప్పా వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఆసీస్ సారథి మాథ్యూ వేడ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు మార్పులతో బరిలోకి దిగుతుండగా, భారత జట్టు ఒక మార్పు చేసింది. ముఖేష్ కుమార్ స్థానంలో అవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ కంగారూలకు చావో రేవో వంటింది. సిరీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాలి.
కాగా, ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భారత యువ జట్టు 2-0 అధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో విశాఖ సాగర తీరాన కంగారూల మట్టికరిపించిన సూర్య దళం.. అనంతరం తిరువనంతపురం గడ్డపై జరిగిన రెండో టీ20లోనూ విజయం సాధించారు.
తుది జట్లు
భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా జట్టు: ట్రావిస్ హెడ్, ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్/కెప్టెన్), నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా, కేన్ రిచర్డ్‌సన్.