- మొదటి టీ20: ఆస్ట్రేలియా- 208/3; ఇండియా- 209/8 (19.5 ఓవర్లలో)
- రెండో టీ20: ఇండియా- 235; ఆస్ట్రేలియా - 191
- మూడో టీ20: ఇండియా- 222: ఆస్ట్రేలియా- 225 (20 ఓవర్లలో)
చూశారుగా..! సొంతగడ్డపై ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఎంత మజా పంచుతుందా! అన్నీ భారీ స్కోర్లే. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 200 పైచిలుకు పరుగులు చేసినా గెలుస్తుందన్న గ్యారెంటీ లేదు. ఆఖరి బంతి పడే వరకూ విజయం ఎవరిని వరిస్తుందో ఊహించలేకపోతున్నాం. గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 222 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ ఆసీస్ దాన్ని చేధించింది. ఈ సిరీస్‌లో ఇప్పుడు మరో మ్యాచ్‌కు వచ్చేశాం..
శుక్రవారం రాయ్‌పూర్‌లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా నాలుగో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా సారథి మాథ్యూ వేడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు భారీ మామార్పులతో బరిలోకి దిగుతున్నాయి. ఆసీస్ ఐదు మార్పులు చేయగా.. టీమిండియా నాలుగు మార్పులు చేసింది.
కాగా, ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ మూడు టీ20 మ్యాచ్‌లు జరగ్గా భారత జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది.
తుది జట్లు
భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్.
ఆస్ట్రేలియా జట్టు: జోష్ ఫిలిప్, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్/కెప్టెన్), బెన్ ద్వార్షుయిస్, క్రిస్ గ్రీన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా.