మొదట యశస్వి జైస్వాల్ మెరుపులు.. అనంతరం 13 పరుగుల స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు.. చివరలో రింకు సింగ్, జితేష్ శర్మ జోడి బాధ్యతాయుత ఇన్నింగ్స్.. రాయ్‌చూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో భారత ఇన్నింగ్స్ హైలెట్స్ ఇవి.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రింకు సింగ్(46; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా.. జితేష్ శర్మ(35; 19 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్(37; 28 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్), రుతురాజ్ గైక్వాడ్(32; 28 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు.
సూర్య, అయ్యర్ విఫలం
ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడతారనుకున్న భారత టీ20 స్పెషలిస్టులు ఇద్దరూ విఫలమయ్యారు. గత రెండు మ్యాచ్‌ల్లో మెరిసిన సూర్య కేవలం ఒక పరుగుకే పెవిలియన్ చేరగా.. అయ్యర్ 8 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ 3 వికెట్లు పడగొట్టగా.. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా చెరో 2 వికెట్లుతీసుకున్నారు.
Two huge wickets for Australia.
— CricTracker (@Cricketracker) December 1, 2023
Shreyas Iyer and skipper Suryakumar Yadav is back in the pavilion.
?: Jio Cinema pic.twitter.com/P6aDXAwp3Z
Australia fightback strongly, but a 56-run stand between Jitesh and Rinku take India to a competitive total ? https://t.co/TV0h5GA5ZD | #INDvAUS pic.twitter.com/G9VM8LXVL2
— ESPNcricinfo (@ESPNcricinfo) December 1, 2023