ఐదు టీ20ల సిరీస్‌ను భారత జట్టు మరో మ్యాచ్ మిగిలివుండగానే 3-1 తేడాతో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే ఊపులో ఆదివారం చిన్నస్వామి వేదికగా జరగనున్న చివరి టీ20లోనూ గెలిచి సిరీస్‌ను 4-1తో ముగించాలని సూర్య సేన చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. దీపక్ చాహర్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ భారత తుది జట్టులోకి రాగా, ఆసీస్ టీమ్‌లో గ్రీన్ స్థానంలో నాథన్ ఎల్లిస్ చోటు దక్కించుకున్నాడు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆసీస్.. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.
తుది జట్లు
భారత జట్టు: యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్.
ఆస్ట్రేలియా జట్టు: జోష్ ఫిలిప్, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్/కెప్టెన్), బెన్ ద్వార్షుయిస్, తన్వీర్ సంఘా, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్.
? Toss Update from Bengaluru ?
— BCCI (@BCCI) December 3, 2023
Australia elect to bowl in the 5th & Final T20I.
Follow the Match ▶️ https://t.co/CZtLulpqqM#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/zdFW3hJZDX