IND vs AUS: ఆఖరి మ్యాచ్‌లో తడబడ్డ బ్యాటర్లు.. ఆసీస్ ఎదుట ఈజీ టార్గెట్

IND vs AUS:  ఆఖరి మ్యాచ్‌లో తడబడ్డ బ్యాటర్లు.. ఆసీస్ ఎదుట ఈజీ టార్గెట్

తొలి నాలుగు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన భారత బ్యాటర్లు ఆఖరి టీ20లో మాత్రం తడబడ్డారు. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన బెంగళూరు పిచ్ పై పరుగులు చేయడానికి నానా అవస్థలు పడ్డారు. ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంలో పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. 

55 పరుగులకే 4 వికెట్లు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ గత ఎప్పటిలానే మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. 15 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్ల సాయంతో 21 పరుగులు చేశాడు. ఆపై కొద్దిసేపటికే జైశ్వాల్(21)న రుతురాజ్ గైక్వాడ్(10), సూర్యకుమార్ యాదవ్(5), రింకూ సింగ్(6) ఔట్ అవ్వడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. ఆ సమయంలో శ్రేయాస్ అయ్యర్(53; 37 బంతుల్లో 5 ఫోర్, 2 సిక్స్‌లు) జట్టును ఆదుకున్నాడు. చివరివరకూ క్రీజులో నిలబడి జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.

ఆసీస్ బౌలర్లలో జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, బెన్ ద్వార్షుయిస్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఆరోన్ హార్డీ, తన్వీర్ సంఘా, నాథన్ ఎల్లిస్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.