భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు చివరి టీ20 జరగనుంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. సిరీస్ ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్ లో రిజర్వ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం టీమిండియా స్క్వాడ్ చూసుకుంటే వాషింగ్ టన్ సుందర్, శివమ్ దూబే మినహా మిగిలిన వారందరికీ తుది జట్టులో ఏదో ఒక మ్యాచ్ లో ఆడేశారు. దీంతో వీరిద్దరినీ ప్లేయింగ్ 11లో ఆడించాలని భారత యాజమాన్యం భావిస్తుంది.
నాలుగో టీ20 లో అద్భుతంగా బౌలింగ్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన అక్షర్ పటేల్ కు ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అక్షర్ స్థానంలో ఆల్ రౌండర్ సుందర్ రానున్నాడు. ఇక మరో ఆల్ రౌండర్ దూబే స్థానంలో ఎవరొస్తారనేది ఆసక్తికరంగా మారింది. లోయర్ ఆర్డర్ లో భారీ షాట్స్ ఆడగల సామర్ధ్యం దూబేకు ఉంది. దీంతో రింకూ సింగ్ ని పక్కన పెడతారా..? లేకపోతే ఓపెనర్లు గైక్వాడ్, జైస్వాల్ ఇద్దరిలో ఒకరికి రెస్ట్ ఇస్తారనే విషయం తెలియాల్సి ఉంది.
ఈ రెండు మార్పులు మినహా భారత తుది జట్టు నాలుగో టీ20 మాదిరిగానే ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుటికే సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా ఎలాంటి ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగుతుందో చూడాలి. సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. స్పోర్ట్స్ 18లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
చివరి టీ20కు భారత తుది జట్టు అంచనా:
యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), రింకు సింగ్/శివం దూబే, అక్షర్ పటేల్/వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్