IND vs AUS: కుర్రాళ్లు సాధించారు.. ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం

IND vs AUS: కుర్రాళ్లు సాధించారు.. ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం

తొలుత రెండు విజయాలు.. అనంతరం ఓటమి.. మరలా రెండు గెలుపులు.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ పలితాలు ఇవి.

తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు అందుకున్న భారత యువ జట్టు, మ్యాక్స్‌వెల్ వీరోచిత ఇన్నింగ్స్ దెబ్బకు మూడో 20లో అనూహ్యంగా ఓటమిపాలైంది. తిరిగి మరలా పుంజుకొని రాయ్‌పూర్ గడ్డపై ఆసీస్ వీరులను మట్టికరిపించి సిరీస్ చేజిక్కించుకుంది. అనంతరం అదే ఊపును బెంగళూరులో కూడా కొనసాగించి సిరీస్‌ను 4-1 తేడాతో ముగించింది. 

ఆదివారం(డిసెంబర్ 3) బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 10 పరుగులు అవసరం కాగా, అర్షదీప్ సింగ్ కేవలం 3 పరుగులిచ్చాడు. దీంతో టీమిండియా ఉత్కంఠ పోరులో విజయాన్ని అందుకుంది. ఛేదనలో బెన్ మెక్‌డెర్మాట్(54; 36 బంతుల్లో 5 సిక్స్ లు) హాఫ్ సెంచరీ చేయగా.. ట్రావిస్ హెడ్(28), మాథ్యూ వేడ్(22) విలువైన పరుగులు చేశారు. 

ఆదుకున్న అయ్యర్

అంతకుముందు శ్రేయాస్ అయ్యర్(53; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. జితేష్ శర్మ(53; 37 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌), అక్సర్ పటేల్(31; 21 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌) పర్వాలేదనిపించారు.