తొలి ఇన్నింగ్స్‌లో ఆచితూచి ఆడిన భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో ధనాధన్ బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎడా పెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు చేస్తున్నాడు. పంత్ 29 బంతుల్లోనే 50 మార్కును చేరుకున్నాడు.
హాఫ్ సెంచరీ పూర్తయ్యాక పంత్ మరింత దూకుడు పెంచాడు. స్టార్క్ వేసిన 23వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. అతని ధాటికి ఆసీస్ ఫీల్డర్లు స్లిప్ వదిలి బౌండరీల దగ్గర పహారా కాస్తున్నారు. ప్రస్తుతం పంత్ స్కోర్.. 31 బంతుల్లో 61. అతని ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.
🚨 RISHABH PANT SHOW 🚨 pic.twitter.com/5FxsnjeWDa
— Johns. (@CricCrazyJohns) January 4, 2025
22 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్..124/ 4. ప్రస్తుతం 128 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజ్‌లో పంత్ (61*), జడేజా (2*) ఉన్నారు.
Also Read :- 46 ఏళ్ల రికార్డు బ్రేక్.. తొలి భారత బౌలర్‌గా బుమ్రా
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 181 పరుగులకే కుప్పకూలింది. దాంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ 3, మహ్మద్ సిరాజ్ 3, జస్ప్రీత్ బుమ్రా 2, నితీష్ రెడ్డి 2 వికెట్లు పడగొట్టారు.