
ఛాంపియన్స్ ట్రోఫీ తుది దశకు చేరుకున్నాం.. మరో మూడు మ్యాచ్‌ల్లో ట్రోఫీ విజేతలు ఎవరో తేలిపోనుంది. ఆదివారంతో లీగ్ దశ మ్యాచ్‌లు ముగియగా.. మంగళ, బుధవారాల్లో సెమీ ఫైనల్ పోరు జరగనుంది. మొదటి సెమీఫైనల్లో ఇండియా vs ఆస్ట్రేలియా, రెండవ సెమీఫైనల్లో న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ క్రమంలో అందరి కళ్లు భారత్- ఆసీస్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. మన ప్రత్యర్థి అంతటి ప్రమాదకరమైన జట్టు. అందుకే ఈ ఆందోళన.
భారత జట్టు ఎంత ఫామ్‌లో ఉన్నా.. ఆసీస్‌ను తక్కువ అంచనా వేయలేం. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.. 2023 వన్డే ప్రపంచకప్. అప్పటివరకు వరుసగా పది మ్యాచుల్లో గెలిచి ఫైనల్ చేరిన టీమిండియా.. ఆఖరి మెట్టుపై ఆసీస్ చేతిలో పరాజయం పాలైంది. టోర్నీ మన దేశంలో జరిగినా.. కప్ మాత్రం కంగారూలు ఎగరేసుకుపోయారు. దీనికి తోడు ఐసీసీ టోర్నీలంటే పూర్తి శక్తిసామర్థ్యాలను వెచ్చించి మరీ ఆడటం ఆసీస్ ప్రత్యేకత. దాంతో వారిని ఏమాత్రం తక్కువ అంచనా వేయలేని పరిస్థితి.
పిచ్ రిపోర్ట్..
మంగళవారం దుబాయ్‌లో 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉంది. వాతావరణం మ్యాచ్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేదు. ఇక పిచ్ విషయానికొస్తే, బ్యాటర్లకు, బౌలర్లకు ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయి. మొదట బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, సమయం గడిచేకొద్దీ స్పిన్నర్లు పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. బౌండరీ లైన్ పెద్దవి కనుక సిక్స్‌లు, ఫోర్లు ఎక్కువ ఆశించలేం. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 260-270 పరుగులు చేసిన మ్యాచ్ హోరాహోరీ తప్పదు. స్టేడియం ఫలితాలను చూస్తే, అత్యధికంగా ఛేజింగ్ చేసిన జట్లు ఇక్కడ విజయాలు సాధించాయి.
Also Read :- క్రికెటర్ నైతికతను దెబ్బ తీసేందుకే ఇలాంటి కామెంట్స్
టీమిండియా ఈ టోర్నీలో దుబాయి పిచ్‌పై మూడు మ్యాచ్‌లు ఆడింది. ఆడిన మూడింటిలో విజయం సాధించింది. మొదటి రెండింటిలో టార్గెట్ చేధించగా.. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టార్గెట్(250) డిఫెండ్ చేసింది.
దుబాయ్ స్టేడియం రికార్డులు
- మొత్తం మ్యాచ్‌లు: 61
- మొదట బ్యాటింగ్ చేసి గెలిచిన మ్యాచ్‌లు: 23
- మొదట బౌలింగ్ చేసి గెలిచిన మ్యాచ్‌లు: 36
- ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్లు: 219
- సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్లు: 193
- అత్యధిక స్కోరు: 355/5 (50 ఓవర్లు) ఇంగ్లాండ్ vs పాకిస్తాన్
- అత్యల్ప స్కోరు: 91/10 (31.1 ఓవర్లు) నమీబియా vs యుఎఇ
- చేధించిన అత్యధిక స్కోరు మ్యాచ్: 287/8 (49.4 ఓవర్లు) శ్రీలంక vs పాకిస్తాన్
- డిఫెండ్ చేసిన అత్యల్ప స్కోరు మ్యాచ్: 168/10 (46.3 ఓవ్స్) యుఎఇ vs నేపాల్
ట్రాక్ రికార్డు..
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా vs ఆస్ట్రేలియా ట్రాక్ రికార్డుల విషయానికొస్తే.. ఇప్పటి వరకు ఈ ఇరు జట్లు నాలుగు సార్లు తలపడ్డాయి. వీటిలో టీమిండియా రెండు సార్లు, ఆస్ట్రేలియా ఒక దానిలో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
ఇక మొత్తం వన్డేల విషయానికొస్తే, భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటివరకు 151 వన్డే మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో ఆస్ట్రేలియా 84 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. భారత్ 57 మ్యాచ్‌ల్లో గెలిచింది. 10 మ్యాచ్‌లు అసంపూర్ణంగా ముగిశాయి.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారత్ vs ఆస్ట్రేలియా సెమీ-ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. డిజిటల్ గా JioHotstarలో లైవ్ ఎంజాయ్ చేయొచ్చు. టాస్ మధ్యాహ్నం 2 గంటలకు.. మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు స్టార్ట్ అవుతుంది.
తుది జట్లు(అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
ఆస్ట్రేలియా: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.