IND vs AUS: కాన‌ల్లీ డకౌట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

IND vs AUS: కాన‌ల్లీ డకౌట్.. తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

చాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతోన్న తొలి సెమీఫైన‌ల్లో ఆస్ట్రేలియా  తొలి వికెట్ కోల్పోయింది. మాథ్యూ షార్ట్ స్థానంలో జట్టులోకి వచ్చిన కూప‌ర్ కాన‌ల్లీ(0) డకౌట్ అయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న కాన‌ల్లీ ఖాతా తేవరకుండానే పెవిలియన్ చేరాడు. షమీ ఓ చక్కని బంతితో అతన్ని బోల్తా కొట్టించాడు. దాంతో, ఆసీస్ 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్ స్కోర్.. 3 ఓవర్లకు 4/1. 

Also Read :  కంగారూల కొత్త వ్యూహం

తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలింగ్ ద్వయం షమీ, పాండ్యా కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. ఆసీస్ బ్యాటర్లకు ఏ చిన్న అవకాశం ఇవ్వడం లేదు. ఇదే ఊపు కొనసాగిస్తే, ఆసీస్ ను తక్కువ పరుగులకే కట్టడి చేయొచ్చు.