వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన శైలిలో శుభారంభాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో హాట్ స్టార్ లైవ్ స్ట్రీమింగ్ ఏకంగా 5 కోట్లు దాటిపోయింది. టాస్ వేస్తున్నప్పుడే 2 కోట్లు దాటిన ఈ స్ట్రీమింగ్ రోహిత్ వేగంగా ఆడటంతో 5.2 కోట్లుగా ఉంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో తొలి ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 20 బంతుల్లోనే 31 పరుగులు చేసాడు.
రోహిత్ ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, రెండు సిక్సులు ఉన్నాయి. ఓపెనర్ గిల్ 4 పరుగులే చేసి స్టార్క్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో రోహిత్ (31), కోహ్లీ (1) ఉన్నారు. లీగ్ మ్యాచ్ ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన రెండు జట్లు విశ్వ విజేతగా నిలిచేందుకు ఆరాటపడుతున్నాయి. రెండు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే సెమీ ఫైనల్ ఆడిన జట్లతోనే బరిలోకి దిగాయి.