వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిని 140 కోట్ల మంది భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. మనవాళ్లు విజయం సాధిస్తారు.. 20 ఏళ్ల కింద ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంటారు అని ఎదురుచూసిన వారిని ఓటమి ఎంతో బాధిస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌లో 47 పరుగులకే మూడు వికెట్లు తీసిన మన బౌలర్లు.. ఆ తర్వాత ఒక వికెట్ కూడా పడుగొట్టలేకపోయారు. అందుకు కారణం లేకపోలేదు.
పగటి సమయంలో మొదట బౌలింగ్‌కు అనుకూలించిన నరేంద్ర మోడీ స్టేడియం పిచ్.. ఆ తర్వాత పిచ్‌పై తేమ పడేకొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయింది. అనగా ఎండ తీవ్రత తగ్గి చల్లటి వాతావరణ వచ్చే సమయానికి పిచ్ క్రమంగా బ్యాటింగ్‌కు అనుకూలించింది. దీంతో సెకండ్ బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఈజీగా టార్గెట్ చేధించింది.
పిచ్‌పై ముందుగానే ఓ అంచనాకు వచ్చిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఈ కారణంగానే టాస్ గెలిచిన వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆసీస్ బౌలర్లు తమ సత్తా చాటారు. విపరీతమైన స్వింగ్ తిరిగింది. దీంతో భారత బ్యాటర్లు పరుగులు చేయడం ఇబ్బందిగా మారింది.
Emotional Indian team after the match ?
— All About Cricket (@allaboutcric_) November 19, 2023
A billion hearts are broken tonight ? pic.twitter.com/yftMJ2UNn5
ఆ తర్వాత మ్యాచ్ క్రమంగా జరిగే కొద్దీ.. సమయం గడిచే కొద్దీ.. బౌలర్లకు స్వింగ్ తిరగటం మానేసింది. దీంతో షమీ, బూమ్రా, సిరాజ్, కుల్ దీప్, జడేజా వికెట్లు తీయటానికి ఇబ్బంది పడ్డారు. ఓ దశలో సిరాజ్, జడేజా వేసిన బంతులు ప్లాట్ కు ఆసీస్ బ్యాటర్లకు వెళ్లాయి. దీంతో వాళ్లు సిక్సులు, ఫోర్లు ఈజీగా కొట్టారు.
ఇదే విషయాన్ని కామెంటేటర్లు సైతం ప్రస్తావించటం విశేషం. బాల్ స్వింగ్ కావటం లేదని.. ప్లాట్ గా వస్తుందని.. అందుకే వికెట్లు పడటం లేదని కామెంటేటర్లు వినిపించారు. ఈ మ్యాచ్ లో భారత ఓటమికి టాస్ కూడా ఒక కారణమైంది.
Another Heartbreak for India in ICC events.? pic.twitter.com/52f0tNAbrq
— CricTracker (@Cricketracker) November 19, 2023