World Cup 2023 Final: ఫైనల్‌లో ఇండియా గెలిస్తే రూ.100 కోట్లు పంచుతా: ఆస్ట్రోటాక్ సీఈవో

World Cup 2023 Final:  ఫైనల్‌లో ఇండియా గెలిస్తే రూ.100 కోట్లు పంచుతా: ఆస్ట్రోటాక్ సీఈవో

ఆహ్మదాబాద్ వేదికగా రేపు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్‌ పైనల్‌మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ గెలిచి ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్ ముద్దాడాలని టీం ఇండియా చూస్తోంది. ఇందుకోసం పూజలు, యాగాలు కూడా జరిపిస్తున్నారు. తాజాగా ఆస్ట్రోటాక్ కంపెనీ సీఈవో కూడా భారత్‌ గెలవాలని కోరుకుంటూ.. తమ కస్టమర్లకు ఓ బంపరాఫర్‌ ప్రకటించారు. ఫైనల్‌లో భారత్‌ గెలిస్తే రూ.100కోట్లు పంచుతానని తెలిపారు. ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. 

"2011లో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచినప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నా. ఆ రోజు నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి ఆడిటోరియంలో మ్యాచ్‌ చూశా. మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు మాకు టెన్షనే. ఆ టోర్నీలో టీమ్‌ఇండియా గెలిచాక.. నా ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పుడు టీమ్‌ఇండియా మళ్లీ ఫైనల్‌కు వచ్చింది. ఈసారి భారత్‌ గెలిస్తే ఏం చేయాలా? అని నేను చాలాసేపు ఆలోచించా. అప్పుడు నా ఆనందాన్ని పంచుకోవడానికి కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారు. కానీ, ఇప్పుడు మా ఆస్ట్రోటాక్‌ యూజర్లంతా నా స్నేహితులే. వారితో కలిసి నా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నా. భారత్‌ ప్రపంచకప్‌ను ముద్దాడితే మా సంస్థ యూజర్లందరికీ రూ.100కోట్లను సమానంగా పంచాలని నిర్ణయించుకున్నా. టీమ్‌ ఇండియా గెలవాలని కోరుకుందాం. ప్రార్థిద్దాం.." అని పునీత్‌ గుప్తా తన పోస్ట్‌లో వెల్లడించారు.