IND vs AUS Final: ఫైనల్‌లో తడబడ్డ భారత బ్యాటర్లు.. ఆసీస్ ముందు పోరాడే లక్ష్యం

IND vs AUS Final: ఫైనల్‌లో తడబడ్డ భారత బ్యాటర్లు.. ఆసీస్ ముందు పోరాడే లక్ష్యం

టోర్నీ అసాంతం పరుగుల వరద పారించిన భారత స్టార్ ఆటగాళ్లు ఫైనల్‌లో మాత్రం చేతలేత్తేశారు. ధాటిగా ఆడి ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్ధేశిస్తారనుకుంటే.. సాధారణ టార్గెట్‌కే పరిమితమయ్యారు. అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైన‌ల్ పోరులో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 240 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్(4) పరుగులకే వెనుదిరగగా, ధాటిగా ఆడే ప్రయత్నంలో రోహిత్ శర్మ(47) వికెట్ పారేసుకున్నాడు. ఆపై కొద్దిసేపటికే అనవసరపు షాట్‌కు ప్రయత్నించి శ్రేయాస్ అయ్యర్(4)  వికెట్ సమర్పించుకున్నాడు. ఆ సమయంలో కోహ్లీ- రాహుల్ జోడి జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 67 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. 

హాఫ్ సెంచ‌రీతో కోహ్లి(54; 63 పరుగులు 4 ఫోర్లు) ప్రమాదకరంగా కనిపించినా.. బ్యాట్ ఝుళిపిస్తాడనున్న సమయానికి కమ్మిన్స్ పెవిలియన్ చేర్చాడు. మరో ఎండ్‌లో ఆడుతూ వచ్చిన రాహుల్() కీలక సమయంలో ఔట్ అవ్వడంతో భారత ఇన్నింగ్స్ కుప్పకూలింది. జడేజా(9), సూర్యకుమార్ యాదవ్(18) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3 వికెట్లు పడగొట్టగా.. హెజిల్‌వుడ్, కమ్మిన్స్ రెండేసి వికెట్లు.. మాక్స్‌వెల్, జంపా చెరో వికెట్ తీసుకున్నారు.