81 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత జట్టును విరాట్ కోహ్లీ(34 నాటౌట్), కేఎల్ రాహుల్(10 నాటౌట్) జోడి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ (10), విరాట్ కోహ్లీ (34)లు క్రీజులో ఉన్నారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు భారత జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్(4) పరుగులకే వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 30 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో రోహిత్ శర్మ(47) వికెట్ పారేసుకోగా.. శ్రేయాస్ అయ్యర్ అనవసరపు షాట్ కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు.
16 Overs
— CricTracker (@Cricketracker) November 19, 2023
101 Runs
3 Big wickets
India fans, how are your nerves in the final? pic.twitter.com/cYNPFDbbh8
సూర్య, జడేజా
క్రీజులో ఉన్న రాహుల్, విరాట్ కోహ్లీ మినహాయిస్తే భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల బ్యాటర్లు వెనుక ఎవరు కనిపించడం లేదు. సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా తదుపరి ఇద్దరి బ్యాటర్లు.