45 రోజుల పాటు క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచిన వన్డే ప్రపంచకప్ 2023 సమరం ముగిసింది. టోర్నీ అసాంతం వరుస విజయాలతో అద్భుతంగా రాణించిన భారత జట్టు ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆసీస్ ముందు ఓటమిని అంగీకరించి ఆరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడేలా చేసింది. ఈ ఓటమితో భారత అభిమానులు దుఃఖసాగరంలో మునిగిపోతే.. ఆసీస్ అభిమానులు, ఆ దేశ క్రికెటర్లు మాత్రం ఆనందోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు.
ఇదిలావుంటే, ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించిన ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఈ గెలుపును మరో లెవెల్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. వరల్డ్ కప్ భార్య కోసమే గెలిచినట్లుగా ఓ సతీమణి ఇది నీ కోసమే.. అని ట్వీట్ చేశాడు.
"మిల్లా అమ్మ ఇది మీ కోసమే.." అని హెడ్ ట్వీట్ చేశాడు. ఇక్కడ మిల్లా అంటే తన కూతురు పేరు. హెడ్ ఈ ఏడాది(2023) ఏప్రిల్ 15న తన చిరకాల స్నేహితురాలు జెస్సికా డేవిస్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ఒక కుమార్తె ఉంది. ఆ చిన్నారి పేరు.. మిల్లా పైజ్ హెడ్. అందువల్లే తన బిడ్డకు తల్లి అయిన జెస్సికా డేవిస్‌పై ప్రేమను చాటుకుంటూ హెడ్ ఈ ట్వీట్ చేశాడు.
Milla's Mum this is for you ??❤️?#CWC23Final #INDvsAUS pic.twitter.com/75CyzbKfcF
— Travis Head (@ImTravisHead) November 19, 2023
బౌండరీల వర్షం
కాగా, 47 పరుగులకే 3 వికెట్లు కోల్పయి కష్టాల్లో ఉన్న ఆసీస్ కు హెడ్ ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. సొంతగడ్డపై భారత బౌలర్లను చితక్కొడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. 240 పరుగుల లక్ష్య ఛేదనలో హెడ్ ఒక్కడే 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137 పరుగులు చేశాడు. దీంతో ఆసీస్ అలవోకగా విజయం సాధించి ఆరో సారి ప్రపంచకప్ విజేతగా అవతరించింది.
Delivering when it matters the most ?
— ICC (@ICC) November 20, 2023
Travis Head dazzles on the grandest stage once again!
More on his #CWC23 Final special ? https://t.co/I6lKE0kXAQ pic.twitter.com/cPWusBfVTa