ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ పోరులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. టోర్నీ ఆసాంతం దంచికొట్టిన గిల్(4), రోహిత్(47), అయ్యర్(4) స్వల్ప పరుగులకే వెనుదిరిగారు. దీంతో టీమిండియా 82 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.
మూడో ఓవర్‍లో ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ శుభ్‌మాన్ గిల్(4) దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఐదో ఓవర్‌లో జంపాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం ట్రావిస్ హెడ్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ముగిసింది. ఆపై కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ (4) కూడా ఔటయ్యాడు. పాట్ కమిన్స్ బౌలింగ్ లో జోష్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 12 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది.
A SUPERB catch from Travis Head dismisses India's skipper!
— ESPNcricinfo (@ESPNcricinfo) November 19, 2023
Rohit Sharma falls again after giving India a fantastic start ? https://t.co/uGuYjoOWie #CWC23 #CWC23Final #INDvAUS pic.twitter.com/OYVluHQY5n
ప్రస్తుతం విరాట్ కోహ్లీ(26), కెఎల్ రాహుల్(4) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ రాణిస్తేనే భారీ స్కోరుపై ఆశలుంటాయి.
Shreyas Iyer falls for four ❌
— ESPNcricinfo (@ESPNcricinfo) November 19, 2023
Wickets in consecutive overs for Australia; India are three down!https://t.co/uGuYjoOWie #CWC23 #CWC23Final #INDvAUS pic.twitter.com/VeHzcKpCOU