World Cup 2023 Final:షమీ జాతకం చాలా బాగుంది.. 2024 జూన్ 25 వరకు తిరుగులేదు: ప్రముఖ జ్యోతిష్యుడు

World Cup 2023 Final:షమీ జాతకం చాలా బాగుంది.. 2024 జూన్ 25 వరకు తిరుగులేదు: ప్రముఖ జ్యోతిష్యుడు

మహ్మద్ షమీ.. ఈ భారత వెటరన్ పేసర్ గురుంచి ఎంత చెప్పినా తక్కువే. మన ప్రధాన అస్త్రం బుమ్రా అయినా.. ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతూ వికెట్లు రాబడుతున్న బౌలర్ మాత్రం షమీనే. ఈ టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన షమీ 23 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడంటే అతని ప్రదర్శన ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ పోరులో 7 వికెట్లు తీసిన షమీ.. భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అందరి ద్రుష్టి అతనిపైనే ఉంది. 

ఆస్ట్రేలియాతో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో షమీ ప్రదర్శన ఎలా ఉండబోతోందనే దానిపై కాశీ హిందూ యూనివర్సిటీ జ్యోతిష్య శాస్త్ర మాజీ పరిశోధకుడు, ప్రముఖ జ్యోతిష్యుడు అరుణ్ కుమార్ మిశ్రా స్పందించారు. ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ప్రకారం.. షమీ 1990, సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జన్మించాడని చెప్పిన ఆయన.. ఈ సమాచారం ఆధారంగా అతని గ్రహాలు, నక్షత్రాల కదలికలను బట్టి జాతకం అద్భుతంగా ఉందని చెప్పారు.

షమీ జన్మదిన తేదిలను బట్టి.. జూన్ 25, 2024 వరకు షమీకి తిరుగులేదని అరుణ్ కుమార్ మిశ్రా చెప్పారు. అప్పటివరకూ అతను రాకెట్‌లా దూసుకుపోతాడని తెలిపారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని అంచనా వేశారు. "గ్రహాల స్థానాల ప్రకారం.. దేవుళ్ల గురువైన బృహస్పతి మరియు అతని(గురు గ్రహం) అంతర్దశ, మహర్దశలు 13 డిసెంబర్ 2021 నుండి 25 జూన్ 2024 వరకు నడుస్తున్నట్లు అరుణ్ కుమార్ మిశ్రా తెలియజేశారు." అయితే, ఈ జ్యోతిష్యం కేవలం ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా చెప్తున్నారని అన్నారు.

అగ్రస్థానంలో షమీ

ఈ టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన షమీ 23 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

  • మహ్మద్ షమీ: 23 వికెట్లు(6 మ్యాచ్‌లు)
  • ఆడమ్ జంపా: 22 వికెట్లు(10 మ్యాచ్‌లు)
  • దిల్షాన్ మధుశంక: 21 వికెట్లు(9 మ్యాచ్‌లు)