భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ తుది అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో ఇక మిగిలింది.. ఫైనల్ మ్యాచే. టైటిల్ పోరులో ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనునున్నాయి. ఆదివారం(నవంబర్ 19) గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ తరుణంలో విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు ఎంత ప్రైజ్‌మనీ దక్కుతుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నవంబర్ 19న జరిగే ఫైనల్ పోరులో గెలుపొందిన జట్టుకు.. ట్రోఫీతో పాటు రివార్డు కింద కళ్లుచెదిరే మొత్తం అందనుంది. ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు.. ట్రోఫీతో పాటు 4 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీ దక్కనుంది. అంటే భారత కరెన్సీలో రూ. 33 కోట్లు ముట్టనుంది. అయితే, ఓడిన జట్టు మాత్రం 2 మిలియన్ డాలర్ల(భారత కరెన్సీలో రూ.16.5 కోట్లు)తో సరిపెట్టుకోవాలి.
కివీస్, సఫారీ జట్లకు ఎంతెంత..?
ఇక సెమీఫైనల్ స్టేజిలోనే నిష్క్రమించిన న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లకు 8 లక్షల డాలర్ల(భారత కరెన్సీలో రూ. 6.6 కోట్లు) చొప్పున అందనుంది. ఇక సూపర్ 6 దశలోనే ఇంటిదారి పట్టిన ఆరు జట్లకూ తలా రూ. 83 లక్షలు దక్కనుండగా.. గ్రూప్ దశలో ప్రతీ మ్యాచ్ విజేతలకు ఒక్కో మ్యాచ్‌కు రూ. 33 లక్షల చొప్పున అందనుంది.
ICC 2023 World Cup prize money:
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2023
- Winner - 33.18cr.
- Runner Up - 16.59cr.
- Losers of Semi Finalists - 6.63cr each.
- Group stage finish - 82.94 Lakhs.
- Winner of each group stage match - 33.17 Lakhs. pic.twitter.com/jvvuakw7qv
కాగా, పది జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ చేరగా.. , సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లు సెమీస్ లో నిష్క్రమించాయి. ఇక పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, శ్రీలంక జట్లు గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టాయి.