రిచర్డ్ కెటిల్ బరో(Richard Kettleborough).. ఈ పేరు చెబితే భారత క్రికెట్ అభిమానుల వెన్నులో భయం పుట్టాల్సిందే. ఒళ్ళంతా చెమటలు పట్టాల్సిందే. ఎందుకంటారా..! 2014 టీ20 ప్రపంచకప్ నుంచి 2022 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు ఇతగాడు అంపైరింగ్ చేసిన ఏ ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లోనూ భారత జట్టు విజయం సాధించలేదు. అందువల్లే ఇతడంటే భయం. తాజాగా, వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు ఐసీసీ ప్రకటించిన అంపైర్ల జాబితాలో రిచర్డ్ కెటిల్ బరో పేరుంది.
ఆదివారం(నవంబర్ 19) అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఇండియా- ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. రిచర్డ్ కెటిల్‌బరో, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లు ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. జోయెల్ విల్సన్ థర్డ్ అంపైర్‌గా, ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్‌కి రిఫరీగా వ్యవహరిస్తారు.
రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌గా మనం ఓడిన నాకౌట్ మ్యాచ్‌లు
- 2014 ప్రపంచకప్ ఫైనల్
- 2015 ప్రపంచకప్ సెమీ ఫైనల్
- 2016 ప్రపంచకప్ సెమీ ఫైనల్
- 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్
- 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్
Hey Bhagwan, why is this guy still here in India? He should have left with the English team by now, right? ?#RichardKettleborough #INDvsAUS #WorldcupFinal #NarendraModiStadium pic.twitter.com/vMh9pYcmcg
— Sann (@san_x_m) November 17, 2023
?Umpires for the #CWC23 final:
— ??Bhanu (@singh_bhan33431) November 17, 2023
On field umpires: Richard Kettleborough, Richard Illingworth.
Third umpire: Joel Wilson.
Match Referee: Andy Pycroft.
Richard Kettleborough ? bad luck for us?
Let's see what happens.#CWC23Final #INDvsAUS #cwcfinal #AUSvsIND pic.twitter.com/TiZq1J67kI