చరిత్ర సృష్టించిన టీమిండియా.. అత్యధిక సిక్సర్లు బాదిన తొలి జట్టు మనదే

చరిత్ర సృష్టించిన టీమిండియా.. అత్యధిక సిక్సర్లు బాదిన తొలి జట్టు మనదే

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు అరుదైన రికార్డు సృష్టించింది. వన్డే చరిత్రలో 3000 సిక్సులు బాదిన తొలి జట్టుగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో 18 సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు.. 3000 సిక్సులు మైలురాయిని అధిగమించేలా చేశారు. అలాగే, ఈ ఏడాది ఇదే వేదికపై న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 19 సిక్సులు బాదారు.

బ్యాటింగ్‌కు అనుకూలించిన‌ ఇండోర్ పిచ్‌పై భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. శుభ్‌మ‌న్ గిల్‌(104), శ్రేయ‌స్ అయ్య‌ర్(105) సెంచ‌రీలు చేయగా.. సూర్య‌కుమార్ యాద‌వ్(72 నాటౌట్), కెప్టెన్ కేఎల్ రాహుల్(52 ) హాఫ్ సెంచరీలతో మెరిశారు. దీంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 399 ప‌రుగులు చేసింది.

వన్డేలలో భారత జట్టు అత్యధిక సిక్సర్లు 

  • 19 vs ఆస్ట్రేలియా, బెంగళూరు, 2013
  • 19 vs న్యూజిలాండ్, ఇండోర్, 2023
  • 18 vs బెర్ముడా, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, 2007
  • 18 vs న్యూజిలాండ్, క్రైస్ట్‌చర్చ్, 2009
  • 18 vs ఆస్ట్రేలియా, ఇండోర్, 2023 

వన్డేల్లో టీమిండియా టాప్ 5 హైయెస్ట్ స్కోర్లు

వన్డేల్లో భారత్‌కు ఇది ఏడో అత్యధిక స్కోరు కాగా, ఆస్ట్రేలియాపై మొదటిది.

  • ఇండియా vs వెస్టిండీస్: 418/5 (2011)
  • భారత్ vs శ్రీలంక: 414/7 (2009)
  • ఇండియా vs బెర్ముడా: 413/5 (2007)
  • భారత్ vs బంగ్లాదేశ్:    409/8 (2022)
  • భారత్ vs శ్రీలంక: 404/5 (2014)