అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ పోరులో టీమిండియా వికెట్ల ప్రవాహం ఆగడం లేదు. వరుస విరామాల్లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. 178 పరుగుల దగ్గర జడేజా(22 బంతుల్లో 9) రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది.
జోష్ హెజిల్‌వుడ్ వేసిన 36వ ఓవర్ లో నాలుగో బంతికి రివ్యూ నుంచి బయటపడ్డ జడేజా.. ఆ మరుసటి బంతికే ఔట్ అయ్యాడు. వికెట్ కీపర్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్(55), సూర్యకుమార్ యాదవ్(0) క్రీజులో ఉన్నారు.
Ravindra Jadeja has been dismissed for 9(22).
— OneCricket (@OneCricketApp) November 19, 2023
And the reactions tell you the story ?
?: Disney+Hotstar#INDvsAUSFinal #RavindraJadeja #Ahmedabad pic.twitter.com/mM5S0KdEHk
నిలకడగా ఆడుతున్న రాహుల్
మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతున్నాడు. 81 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రాహుల్ కోహ్లీతో కలిసి 67 పరుగులు, జడేజాతో కలిసి 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రాహుల్ చివరివరకూ క్రీజులో నిలబడితే ఆసీస్ ముందు సరైన లక్ష్యాన్ని నిర్ధేశించవచ్చు.
1⃣7⃣th ODI FIFTY for KL Rahul! ? ?
— BCCI (@BCCI) November 19, 2023
This has been a solid knock in the #CWC23 #Final! ? ?
Follow the match ▶️ https://t.co/uVJ2k8mWSt#TeamIndia | #MenInBlue | #INDvAUS | @klrahul pic.twitter.com/MQHeIiG3L4