IND vs AUS: జైశ్వాల్ ఔట్.. థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయం

IND vs AUS: జైశ్వాల్ ఔట్.. థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయం

మెల్‌బోర్న్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ సమీకరణాలు గంటగంటకు మారుతున్నాయి. కాసేపు 'డ్రా', కాసేపు ఓటమి అన్నట్లు సాగుతోంది. ఎలాంటి ఫలితం వస్తుందో అంతుపట్టడం లేదు. ఇదిలావుంటే, ఈ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ ఆసీస్‌కు అనుకూలంగా తీర్పిచ్చారు. జైశ్వాల్ ఔట్ అన్నట్లు రుజువులు లేకపోయినా.. ఔటిచ్చారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమవుతోంది. 

అసలు ఏం జరిగిందంటే..?

భారత ఇన్నింగ్స్ 71వ ఓవర్‌లో కమిన్స్ వేసిన ఓ బంతిని జైశ్వాల్ ఫైన్‌లెగ్ వైపుగా ఆడబోయాడు. బంతి బ్యాట్ తగలకుండా నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో ఆసీస్ ఆటగాళ్లు క్యాచ్ ఔట్ కోసం అప్పీల్ చేయగా.. ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఆన్-ఫీల్డ్ అంపైర్ జోయెల్ విల్సన్ నాటౌట్ ఇచ్చారు. దాంతో, ఆసీస్ కెప్టెన్ సమీక్ష(డీఆర్‌ఎస్‌) కోరగా.. థర్డ్ అంపైర్ వివాదాస్పద తీర్పిచ్చారు. స్నికో మీటర్‌లో స్పైక్స్‌ రాకపోయినా.. బంతి టర్న్‌ అయిందనే కారణంతో ఔటిచ్చారు. ఈ విషయంపై జైశ్వాల్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో వాదించినా ఫలితం దక్కలేదు. థర్డ్‌ అంపైర్ నిర్ణయమే ఫైనల్ కనుక వారు అతనికి సర్ది చెప్పి బయటకు పంపించారు.

ALSO READ :IND vs AUS: 87 ఏళ్ల నాటి రికార్డు బద్దలు.. మెల్‌బోర్న్ టెస్టుకు 3లక్షల 50వేల మంది హాజరు

‘డ్రా’నా..! ఓటమా..!

ప్రస్తుతం టీమిండియా స్కోరు 75 ఓవర్లు ముగిసేసరికి.. 148/7. క్రీజులో సుందర్(3), ఆకాశ్‌ దీప్(7). ఇంకో 17 ఓవర్ల ఆట ముగిలివుంది. మరో10 ఓవర్లు పాటు వీరిద్దరూ క్రీజులో ఉంటే టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కినట్లే.