సిడ్నీ టెస్టులో బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రెకార్డుల్లోకెక్కాడు. రెండోరోజు ఆటలో ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా ఈ ఘనత సాధించాడు. భారత పేసర్ ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ 32 వికెట్లు పడగొట్టాడు.
46 ఏళ్ల క్రితం బేడీ..
గతంలో ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బిషన్ సింగ్ బేడీ పేరిట ఉండేది. 1977/78లో ఆస్ట్రేలియా పర్యటనలో బేడీ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొత్తం 31 వికెట్లతో ముగించాడు. ఆ రికార్డును బుమ్రా అధిగమించాడు.
ALSO READ : Rohit Sharma: నేను రిటైర్ అవ్వలేదు.. రెస్ట్ మాత్రమే.. మౌనం వీడిన రోహిత్ శర్మ
ఆసీస్ గడ్డపై భారత్ తరఫున టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు
- జస్ప్రీత్ బుమ్రా: 32* వికెట్లు (2024-25)
- బిషన్ సింగ్ బేడీ: 31 వికెట్లు (1977-78)
- భగవత్ చంద్రశేఖర్: 28 వికెట్లు (1977-78)
- కపిల్ దేవ్: 25 వికెట్లు (1991-92)