World Cup 2023 Final: వరల్డ్ కప్ ఫైనల్ జరగనివ్వం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు

World Cup 2023 Final: వరల్డ్ కప్ ఫైనల్ జరగనివ్వం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు

భారత్‌ వేదికగా జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్‌ని 'వరల్డ్ టెర్రర్ కప్’గా మారుస్తానంటూ గతంలో బెదిరింపులకు పాల్పడ్డ ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నున్.. మరోసారి అలాంటి సందేశాలు పంపాడు. ఆదివారం(నవంబర్ 19) అహ్మదాబాద్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను నిలిపివేయాలని హెచ్చరిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. కాదని కొనసాగిస్తే అంతరాయం కలిగిస్తామని హెచ్చరించాడు. 

ఈ వీడియోలో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 నాటి గుజరాత్ అల్లర్ల గురించి 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 గుజరాత్ అల్లర్ల గురించి ప్రస్తావించాడు. తద్వారా ముస్లిం, క్రైస్తవ వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ వైఖరి గురించి కూడా పన్నూన్ మాట్లాడాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 
నిషేధిత సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్‌గా ఉన్న పన్నూన్.. ఇలా హెచ్చరించడం ఇదే తొలిసారి కాదు. భారత ప్రధాని నరేంద్ర మోఢీని హెచ్చరిస్తూ గత నెలలో ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నుంచి భారత ప్రధాని గుణపాఠం నేర్చుకోవాలన్న అతడు.. త్వరలో ఇండియాలో కూడా ఇలాంటి యుద్ధం ప్రారంభమైతుందని బెదిరించాడు. అలాగే, వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభానికి ముందు కూడా ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డాడు. భారత్‌ వేదికగా జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్‌ని 'వరల్డ్ టెర్రర్ కప్’గా మారుస్తానంటూ హెచ్చరించాడు.

 

పోలీసుల నీడలో అహ్మదాబాద్

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ కప్‌ ఫైనల్ పోరుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉపప్రధాని రిచర్డ్ మార్లెస్ హాజరుకానుండడంతో కేంద్ర బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. రానున్న 48 గంటలు అహ్మదాబాద్ నగరం మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోనుంది.