మెల్ బోర్న్ వేదికగా జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తేలిపోయిన భారత బౌలర్లు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో పుంజుకున్నట్లు కనిపించినా ఆసీస్ ఆఖరి వికెట్ పడగొట్టలేకపోయారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. క్రీజులో నాథన్ లైయన్ (41*), స్కాట్ బోలాండ్ (10*) ఉన్నారు. వీరిద్దరూ పదో వికెట్‌కు 55 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం. ప్రస్తుతం ఆస్ట్రేలియా 333 పరుగుల లీడ్‌లో ఉంది.
భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 3, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. ఈ టెస్టులో మిగిలివుంది ఆఖరి రోజు మాత్రమే. ఆసీస్ ఇన్నింగ్స్‌ను మరో 20 పరుగులలోపు ముగించినా.. భారత లక్ష్యం 350 పరుగుల వరకూ అంచనా వేయవచ్చు. చివరి రోజు అంత పెద్ద లక్ష్యాన్ని చేధించడమంటే కష్టంతో కూడుకున్నదే. ఇప్పుడు రోహిత్ సేనకు 'డ్రా' కోసం పోరాడటం తప్ప మరో అవకాశం ఉండకపోవచ్చు.
Name this duo. pic.twitter.com/ul4nmOjZsz
— ESPNcricinfo (@ESPNcricinfo) December 29, 2024
సిరాజ్ జోరు.. బుమ్రా మాయాజాలం
నాలుగో రోజు ఆటలో నిలకడగా ఆడుతోన్న ఆసీస్‌ను మహ్మద్ సిరాజ్ దెబ్బకొట్టాడు. ఓ సూపర్ డెలివరీతో ఉస్మాన్ ఖవాజా (21)ను క్లీన్‌బౌల్డ్ చేసిన సిరాజ్.. అదే ఊపులో 80 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్(13)ను వెనక్కి పంపాడు. అక్కడినుండి ఆసీస్ కేవలం 11 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. బుమ్రా మాయాజాలంతో నిమిషాల వ్యవధిలోనే ట్రావిస్ హెడ్(1), మిచెల్ మార్ష్(0), అలెక్స్ క్యారీ(2)లను పెవిలియన్ చేరారు. దాంతో, మ్యాచ్ పై టీమిండియా పట్టు బిగించినట్లు కనిపించింది.
ఆ సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లబుషేన్ (70), కెప్టెన్ కమిన్స్ (41) ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఎలా గోలా భారత బౌలర్లు శ్రమించి ఈ జోడీని పెవిలియన్ పంపినా.. నాథన్ లైయన్ (41*)- స్కాట్ బోలాండ్ (10*) జోడి అడ్డుపడ్డారు.
అంతుకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగుల వద్ద ఆలౌటైంది. నాలుగోరోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. మునుపటి రోజు స్కోరుకు కేవలం 9 పరుగులు మాత్రమే జోడించారు. సెంచరీ హీరో నితీశ్ రెడ్డి (114) లియోన్ బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో, ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 120 పరుగుల ఆధిక్యం లభించింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా ఐదు మ్యాచుల సిరీస్‌లో ఇండియా, ఆసీస్ చెరో మ్యాచ్ గెలవగా.. మరో మ్యాచ్ డ్రా అయ్యింది. నాలుగో టెస్ట్‌లో గెలిచి సిరీస్‌లో అధిక్యం సాధించాలని ఇరు జట్లు ఉవ్విళ్లురుతున్నాయి.
That's Stumps on Day 4
— BCCI (@BCCI) December 29, 2024
Australia reach 228/9 and lead by 333 runs
Updates ▶️ https://t.co/njfhCncRdL#TeamIndia | #AUSvIND pic.twitter.com/Gw8NbCljL7