సిడ్నీ: వచ్చే నెలలో ఇండియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడే అవకాశాల్లేవు. ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ ఐదో టెస్ట్‌లో విరిగిన మణికట్టుతోనే కమిన్స్ ఆడినట్లుగా తెలుస్తోంది. దీంతో రిస్ట్ ఎముకలో చీలిక వచ్చినట్లు డాక్టర్లు అనుమానిస్తున్నారు.
అయితే దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా స్పందించలేదు. ‘ఐదో టెస్ట్ తొలి రోజే కమిన్స్ రిస్ట్‌కు గాయమైంది. దానికి బ్యాండేజ్ వేసుకుని మ్యాచ్ ఆడాడు. కానీ గాయం అతని బౌలింగ్‌పై ప్రభావం చూపలేదు. వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని కమిన్స్‌కు రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం’ అని సీఏ వర్గాలు తెలిపాయి.