ఆస్ట్రేలియాతో టీమిండియా .. తిరువనంతపురంలో రెండో టీ20

ఆస్ట్రేలియాతో టీమిండియా ..  తిరువనంతపురంలో రెండో టీ20
  • బౌలర్లపై ఫోకస్
  • మరో విక్టరీపై ఇండియా గురి
  • రా. 7 నుంచి  స్పోర్ట్స్ 18, జియో సినిమాలో

తిరువనంతపురం: వరల్డ్ కప్‌‌‌‌ అనంతరం ఆడిన తొలి పోరులో.. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ నాయకత్వంలో ఆస్ట్రేలియాపై  రికార్డు విక్టరీ సాధించిన టీమిండియా టీ20 సిరీస్‌‌‌‌లో అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో భాగంగా ఆదివారం జరిగే రెండో టీ20లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ  మ్యాచ్‌‌‌‌లో ఇండియా యంగ్ బౌలర్లపై ఫోకస్‌‌‌‌ ఉండనుంది. వైజాగ్‌‌‌‌లో పేసర్ ముకేశ్​ కుమార్ తప్ప మిగతా బౌలర్లంతా ఎక్కువ రన్స్‌‌‌‌ ఇచ్చుకున్నారు. 

ఆసీస్ బ్యాటర్ల జోరును ఏమాత్రం అడ్డుకోలేకపోయారు.  పేసర్లు అర్ష్‌‌‌‌దీప్ సింగ్, ప్రసిధ్​ కృష్ణ ఓవర్‌‌‌‌కు 10.25, 12.50 రన్స్‌‌‌‌ చొప్పున ఇచ్చుకోగా.. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఓవర్‌‌‌‌కు 13.50 రన్స్‌‌‌‌ లీక్‌‌‌‌ చేశాడు. ఈ ఫార్మాట్‌‌‌‌లో బౌలర్లపై బ్యాటర్లు ఆధిపత్యం చూపెట్టడం కొత్తేం కాదు. కానీ, వైజాగ్‌‌‌‌లో ఈ ముగ్గురి బౌలింగ్‌‌‌‌లో ఎలాంటి వైవిధ్యం కనిపించలేదు. సిరీస్‌‌‌‌లో ఆధిక్యాన్ని డబుల్ చేసుకోవాలంటే బౌలర్లు వెంటనే పుంజుకోవాల్సి ఉంటుంది. 

ఈ విషయంలో వాళ్లు ముకేశ్​ను చూసి నేర్చుకోవాలి. అతను యార్కర్లు, బౌన్సర్లు, ఆఫ్‌‌‌‌ స్టంప్‌‌‌‌ లైన్‌‌‌‌లో వైడ్ డెలివరీలతో రన్స్ నియంత్రించాడు. ఈ పోరులో మిగతా బౌలర్లు కూడా అతడిని అనుసరిస్తే ఆసీస్‌‌‌‌ బ్యాటర్లను కట్టడి చేయొచ్చు.  ముఖ్యంగా వైట్‌‌‌‌ బాల్ ఫార్మాట్‌‌‌‌లో చాలా ఫ్యూచర్ ఉందని భావిస్తున్న బిష్ణోయ్‌‌‌‌కు ఈ సిరీస్ కీలకం కానుంది. తొలి మ్యాచ్‌‌‌‌లో తను పూర్తిగా నిరాశ పరిచాడు. జోష్​ ఇంగ్లిస్ అతడిని టార్గెట్‌‌‌‌ చేశాడు. తాను కేవలం గూగ్లీలపైనే ఆధారపడలేనని బిష్ణోయ్ గ్రహించాలి.

 గాయం నుంచి కోలుకొని వచ్చిన పేసర్ ప్రసిధ్​ బౌలింగ్‌‌‌‌ కూడా అంతే వీక్‌‌‌‌గా ఉంది. వన్డే వరల్డ్ కప్‌‌‌‌ టీమ్‌‌‌‌లో భాగమైన యువ పేసర్‌‌‌‌‌‌‌‌కు నెట్స్‌‌‌‌లో ఇండియా టాప్‌‌‌‌ ప్లేయర్లు, కోచ్‌‌‌‌లతో కలిసి పని చేసినా తన బౌలింగ్‌‌‌‌ను ఇంప్రూవ్‌‌‌‌ చేసుకున్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ట్రాక్ నుంచి బౌన్స్‌‌‌‌ను రాబట్టాలని అతను చేసిన ప్రయత్నం ఆసీస్ బ్యాటర్లను మరింత రెచ్చిపోయేలా చేసింది. అయితే బౌలర్లు నిరాశ పరిచినా  కెప్టెన్ సూర్యకుమార్, ఇషాన్, రింకూ సింగ్, జైస్వాల్ మెరుపులతో ఇండియా భారీ టార్గెట్‌‌‌‌ను ఛేజ్‌‌‌‌ చేయగలింది. 

బ్యాటింగ్‌‌‌‌ విషయంలో ఇండియా టీమ్‌‌‌‌లో పెద్దగా సమస్యలు లేవు. ఒక్క బాల్‌‌‌‌ ఆడకుండానే రనౌటైన ఓపెనర్ రుతురాజ్‌‌‌‌తో పాటు తొలి పోరులో ఆకట్టుకోలేకపోయిన తిలక్‌‌‌‌ వర్మ ఈ మ్యాచ్‌‌‌‌లో బ్యాట్‌‌‌‌తో  సత్తా చాటితే జట్టుకు తిరుగుండదు. తొలి మ్యాచ్‌‌‌‌లో ఆడిన జట్టుతోనే ఇండియా బరిలోకి దిగే చాన్సుంది.

ఆసీస్‌‌‌‌ లెక్క సరి చేయాలని.. 

మొదటి మ్యాచ్‌‌‌‌లో అంత భారీ స్కోరును కాపాడుకోలేకపోయిన ఆస్ట్రేలియా ఈసారి తమ తడాఖా చూపించాలని ఆశిస్తోంది. ఈ మ్యాచ్‌‌‌‌లోనూ ఓడితే సిరీస్‌‌‌‌లో 0–2తో నిలిస్తే పుంజుకోవడం కష్టం కాబట్టి వెంటనే లెక్క సమం చేయాలని కోరుకుంటోంది. అందుకు వైజాగ్‌‌‌‌లోని లభించిన కొన్ని సానుకూలతలను సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలని అనుకుంటోంది. తొలి పోరులో ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా వచ్చిన  జోష్​ ఇంగ్లిస్  మెరుపు సెంచరీతో చెలరేగగా.. మరో ఓపెనర్ గా స్టీవ్ స్మిత్‌‌‌‌ను పంపించాలన్న ఎత్తుగడ పెద్దగా ఫలితం ఇవ్వలేదు. 

స్మిత్ ఫిఫ్టీ (41 బంతుల్లో 52) కొట్టినా ఫ్లాట్ వికెట్‌‌‌‌పై  నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. దాంతో, ఈ పోరులో ఆసీస్ తమ బ్యాటింగ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ను మారుస్తుందేమో చూడాలి. మరోవైపు ఇండియా బౌలర్ల  మాదిరిగానే బెరెండార్ఫ్ మినహా ఆసీస్ బౌలర్లు కూడా తేలిపోయారు. దాంతో కంగారూ టీమ్‌‌‌‌ కూడా బౌలింగ్‌‌‌‌లో మెరుగవ్వాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. తన్వీర్ స్థానంలో లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాను బరిలోకి దింపే అవకాశం ఉంది.

మ్యాచ్‌‌‌‌కు వాన ముప్పు

ఈ మ్యాచ్‌‌‌‌కు వాన అడ్డొచ్చే అవకాశం కనిపిస్తోంది. శనివారం చినుకులు పడటంతో పిచ్‌‌‌‌ను కవర్లతో కప్పిఉంచారు. ఆదివారం కూడా వాన సూచన ఉంది. ఈ స్టేడియంలో ఇప్పటిదాకా మూడే మ్యాచ్‌‌‌‌లు జరిగాయి. వాన అంతరాయం కలిగించిన తొలి మ్యాచ్‌‌‌‌లో తప్ప మిగతా రెండింటిలో ఛేజింగ్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ గెలిచాయి. ఈ వికెట్‌‌‌‌పై ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. కాబట్టి టాస్ నెగ్గిన జట్టు ఛేజింగ్‌కు మొగ్గు చూపొచ్చు.