ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు దంచికొట్టిన విషయం తెలిసిందే. నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగుల భారీ స్కోర్ చేశారు. ఈ మ్యాచ్ లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండరీనే అన్నట్లు చెరేగిన సూర్య 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. దీంతో వన్డేల్లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును బద్దలు కొట్టాడు. కోహ్లి గతంలో ఆస్ట్రేలియాపై 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. సూర్య ఆ రికార్డును అధిగమించాడు.
6⃣6⃣6⃣6⃣
— BCCI (@BCCI) September 24, 2023
The crowd here in Indore has been treated with Signature SKY brilliance! ??#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/EpjsXzYrZN
వన్డేల్లో ఆస్ట్రేలియాపై భారత క్రికెటర్ల ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్
- సూర్యకుమార్ యాదవ్ - 24 బంతులు
- విరాట్ కోహ్లీ - 27 బంతులు
- విరాట్ కోహ్లీ - 31 బంతులు
- హార్దిక్ పాండ్యా - 31 బంతులు
6వ భారత క్రికెటర్
అలాగే, వన్డే క్రికెట్‌లో భారత్ నుంచి ఇది ఆరో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం గమనార్హం. ఈ జాబితాలో మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు అజిత్ అగార్కర్ అగ్రస్థానంలోఉన్నారు. 2000లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అగార్కర్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
వన్డేల్లో భారత ప్లేయర్ల ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్
- అజిత్ అగార్కర్: 21 బంతుల్లో (2000లో జింబాబ్వేపై)
- కపిల్‌దేవ్: 22 బంతుల్లో (1983లో వెస్టిండీస్‌పై)
- వీరేంద్ర సెహ్వాగ్: 22 బంతుల్లో (2001లో కెన్యాపై)
- రాహుల్ ద్రవిడ్: 22 బంతుల్లో (2003లో న్యూజిలాండ్‌పై)
- యువరాజ్‌సింగ్: 22 బంతుల్లో (2004లో బంగ్లాదేశ్‌పై)
- సూర్యకుమార్ యాదవ్: 24 బంతుల్లో (2023 ఆస్ట్రేలియాపై)