నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడని సమాచారం. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా దూరమవ్వడంతో సూర్యకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. అలాగే, ఈ సిరీస్‌కు భారత మాజీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారట.
సోమవారం అహ్మదాబాద్‌లో సమావేశమైన సెలెక్టర్లు మొదట శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించాలని భావించారట. అయితే అతనికి పనిభారం ఎక్కువ కాకూడదన్న కారణంతో సూర్య వైపు మొగ్గుచూపారని సమాచారం. ఈ సిరీస్ నుంచి భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వంలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన యువ జట్టును కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జట్టును ప్రకటించే అవకాశం ఉంది.
? Suryakumar Yadav set to lead India in the five T20Is against Australia, starting on November 23 pic.twitter.com/PCSHKp36fP
— Cricbuzz (@cricbuzz) November 20, 2023
ఇండియా vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్
- ఫస్ట్ టీ20 (నవంబర్ 23): వైఎస్ఆర్ స్టేడియం(విశాఖపట్నం)
- రెండో టీ20 (నవంబర్ 26): గ్రీన్ ఫీల్డ్ స్టేడియం (తిరువనంతపురం)
- మూడో టీ20 (నవంబర్ 28): బర్సప్ప స్టేడియం (గుహవటి)
- నాలుగో టీ20 (డిసెంబర్ 01): విధర్భ క్రికెట్ గ్రౌండ్ (నాగపూర్)
- ఇదో టీ20 (డిసెంబర్ 03): రాజీవ్ గాంధీ స్టేడియం (హైదరాబాద్)