నేను రిటైర్‌‌‌‌ కాలేదు..ఈ మ్యాచ్‌ నుంచి మాత్రమే తప్పుకున్నా: రోహిత్‌‌‌‌ శర్మ

నేను రిటైర్‌‌‌‌ కాలేదు..ఈ మ్యాచ్‌ నుంచి మాత్రమే తప్పుకున్నా: రోహిత్‌‌‌‌ శర్మ

సిడ్నీ : ఆస్ట్రేలియాతో ఐదో టెస్ట్‌‌‌‌లో తనకు చోటు లభించకపోవడంపై రోహిత్‌‌‌‌ శర్మ స్పందించాడు. ఫామ్‌‌‌‌లో లేకపోవడం, జట్టు అవసరాల మేరకు తాను తుది జట్టు నుంచి తప్పుకున్నానని చెప్పాడు. ‘నేను రిటైర్‌‌‌‌ కాలేదు. ఫామ్‌‌‌‌లో లేను కాబట్టి మ్యాచ్‌‌‌‌ నుంచి తప్పుకున్నా. ఇదే విషయాన్ని కోచ్‌‌‌‌, సెలెక్టర్లకు చెప్పా. నేను రన్స్‌‌‌‌ చేయలేకపోతున్నా. ఇది ముఖ్యమైన మ్యాచ్‌‌‌‌ కావడంతో ఫామ్‌‌‌‌లో ఉన్న మరో ఆటగాడు కావాలి. ఫామ్‌‌‌‌లో లేని ప్లేయర్లను టీమ్‌‌‌‌ మోయలేదు. అంతేగానీ నేను ఎక్కడికి వెళ్లలేదు’ అని రోహిత్‌‌‌‌ పేర్కొన్నాడు. దాంతో తన కెరీర్‌‌పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు. ఎప్పుడు రిటైరవ్వాలో బయటి వ్యక్తులు తనకు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. 

తాను ఆసీస్‌‌‌‌కు వచ్చింది ఆడటానికేనని స్పష్టం చేసిన హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ బయట కూర్చోవడానికి రాలేదన్నాడు.  ‘సిడ్నీ టెస్టు నుంచి వైదొలగానే నిర్ణయం వ్యక్తిగతంగా కఠినంగా అనిపించింది. మ్యాచ్‌‌‌‌ ఆడటానికే ఇంత దూరం వచ్చా. బయట వేచి చూసేందుకు ఇక్కడి వరకు రాలేదు. 2007లో తొలిసారి డ్రెస్సింగ్‌‌‌‌ రూమ్‌‌‌‌కి వచ్చినప్పట్నించి ఇప్పటి వరకు మ్యాచ్‌‌‌‌ గెలవాలనే చెబుతుంటాను. కొన్నిసార్లు జట్టుకు ఏమి అవసరమో మనం కూడా అర్థం చేసుకోవాలి. జట్టును ముందు వరుసలో ఉంచకపోతే మనం ఆడినా ప్రయోజనం లేదు. మనం కోసం ఆడి రన్స్‌‌‌‌ చేస్తే ఏం లాభం.

జట్టుకు ఏం కావాలో అదే మనమూ చేయాలి’ అని కెప్టెన్‌‌‌‌ వెల్లడించాడు. బయట వచ్చే పుకార్లు ప్లేయర్లపై ఎలాంటి ప్రభావం చూపించవన్నాడు. కొన్ని విషయాలను నియంత్రించలేనప్పుడు వాటి గురించి చింతించాల్సిన అవసరం కూడా లేదన్నాడు. ఇక్కడ రెండు సార్లు సిరీస్‌‌‌‌ గెలిచే అవకాశం తమకు వచ్చినా చేజారిందన్నాడు. కానీ ఇప్పుడు సిరీస్‌‌‌‌ గెలవకపోయినా ట్రోఫీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.

విమర్శల వల్ల తన కెప్టెన్సీ పద్ధతిని మార్చుకోలేనని రోహిత్‌‌‌‌ స్పష్టం చేశాడు. ‘140 కోట్ల మంది మన ఆటపై తీర్పు ఇస్తారు. నా ఆటపై, కెప్టెన్సీపై నాకు ఎలాంటి అనుమానం లేదు. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. కెప్టెన్సీ విషయంలో పద్దతి మార్చుకోవడం ఇష్టం లేదు. కొన్నిసార్లు తప్పులు జరగొచ్చు. కానీ ఆలోచనైతే  చెడ్దది కాదు’ అని హిట్‌మ్యాన్ చెప్పుకొచ్చాడు.