టీమిండియా స్టాండిన్ కెప్టెన్, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పికి గురవడం ఆందోళన కలిగిస్తోంది. లంచ్ బ్రేక్ అనంతరం ఒక ఓవర్ వేసి అసౌకర్యానికి గురైన బుమ్రా వెంటనే గ్రౌండ్ వీడాడు. అతని ప్లేస్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్‌కు రాగా.. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మ్యాచ్ సాగుతుండగానే టీమ్ డాక్టర్‌తో కలిసి బుమ్రా స్కానింగ్‌కు వెళ్లాడు. ‘ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే బుమ్రాకు స్కానింగ్ నిర్వహించారు.
ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు. తను బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది లేదు. బౌలింగ్ విషయం తెలియాలంటే ఆదివారం ఉదయం వరకూ చూడాలి. తన శరీరం ఎలా స్పందిస్తుందో చూడాలి. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడిని పర్యవేక్షిస్తోంది’ అని జట్టు వర్గాలు తెలిపాయి. ఈ సిరీస్‌లో బుమ్రా టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఒకవేళ తను ఆటకు దూరం అయితే ఇండియా విజయావకాశాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి.
ఈ సిరీస్‌లో బుమ్రా తీసిన వికెట్లు. విదేశీ గడ్డపై టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఇండియా బౌలర్‌గా స్పిన్ లెజెండ్ బిషన్ సింగ్ బేడీ రికార్డును బ్రేక్ చేశాడు. బేడీ 1977-78లో ఆసీస్ టూర్‌లోనే 31 వికెట్లు పడగొట్టాడు.