ఉప్పల్ వేదికగా టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్‌లు లేక బాధలో ఉన్న హైదరాబాదీలకు మరో చేదువార్త ఇది. డిసెంబర్ 03న రాజీవ్ గాంధీ స్టేడియం(ఉప్పల్) వేదికగా జరగాల్సిన భారత్ - ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్‌ను బెంగళూరుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా అదే రోజు (డిసెంబర్ 3) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
భద్రత కల్పించలేమన్న పోలీసులు!
ఎన్నికల ఫలితాలు వెలువడగానే రాజకీయ నేతల హంగామా మాములుగా ఉండదు. అనుచరులు పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ సంబరాల్లో మునిగిపోతారు. కొన్ని చోట్ల ఊరేగింపులు గట్రా ఉంటాయి. ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలంటే పోలీస్ భద్రత ఎక్కువగానే అవసరం. దాంతో సరిగ్గా అదేరోజు మ్యాచ్ అంటే భద్రత కల్పించలేమని తెలంగాణ పోలీసులు హెచ్‌సీఏ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై సానుకూలంగా స్పందించిన బీసీసీఐ పెద్దలు మ్యాచ్‌ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారట. మరోవైపు, నాగ్‌పూర్ వేదికగా జరగాల్సిన నాలుగో టీ20ని రాయ్‌పూర్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు.
India vs Australia 5th T20 scheduled in Hyderabad on 3rd December is shifted to Bangalore as election counting day falls on same day and Police could not provide security. pic.twitter.com/AWXKSv53hW
— All About Cricket (@allaboutcric_) November 8, 2023
ఇండియా- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్
- ఫస్ట్ టీ20 (నవంబర్ 23): వైఎస్ఆర్ స్టేడియం(విశాఖపట్నం)
- రెండో టీ20 (నవంబర్ 26): గ్రీన్ ఫీల్డ్ స్టేడియం (తిరువనంతపురం)
- మూడో టీ20 (నవంబర్ 28): బర్సప్ప స్టేడియం (గుహవటి)
- నాలుగో టీ20 (డిసెంబర్ 01): విధర్భ క్రికెట్ గ్రౌండ్ (నాగపూర్)
- ఇదో టీ20 (డిసెంబర్ 05): రాజీవ్ గాంధీ స్టేడియం (హైదరాబాద్)
Sad news for Hyderabad and Nagpur fans :
— All About Cricket (@allaboutcric_) November 8, 2023
Matches scheduled for India vs Australia T20 series set to be Shifted to Bangalore and Raipur.
4th T20i - From Nagpur will be shifted to Raipur.
5th T20i - From Hyderabad will be shifted to Bangalore.
Feel for Hyderabad & Nagpur fans,… pic.twitter.com/NidcmlQsC5