IND vs AUS: ఓరీ ‘హెడ్’ ఈసారికి వదిలేయరా.. వైరలవుతోన్న బెస్ట్ మీమ్స్ ఇవే..!

IND vs AUS: ఓరీ ‘హెడ్’ ఈసారికి వదిలేయరా.. వైరలవుతోన్న బెస్ట్ మీమ్స్ ఇవే..!

ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ముగియగా..  మంగళ, బుధవారాల్లో సెమీ ఫైనల్ పోరు జరగనుంది. మొదటి సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనున్న ఈ మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను అభిమానులు.. ఇండియా vs ట్రావిస్ హెడ్ అన్నట్లుగా మార్చేశారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది.

ఆస్ట్రేలియా జట్టు మనకు కొరకరాని కొయ్యలా తయారయ్యింది. ప్రతి టోర్నీలోనూ అడ్డుతగులుతూ సై అంటే సై అంటోంది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ మనకు అతిపెద్ద తలనొప్పి. భారత్ అంటేనే చెలరేగిపోయే ఈ ఆసీస్ హిట్టర్.. అఫ్గాన్‌పై హాఫ్ సెంచరీ సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. దాంతో భారత అభిమానులు ట్రావిస్ హెడ్ పట్ల తమ భయాన్ని సరదాగా నెట్టింట వ్యక్తం చేస్తున్నారు.

రెండు టోర్నీల్లోనూ అతడే అడ్డు..

మొదటిది.. భారత్ ఆతిథ్యమిచ్చిన 2023 వన్డే ప్రపంచ కప్.. భారత్‌తో జరిగిన ఫైనల్లో హెడ్ 120 బంతుల్లో 137 పరుగులు చేశాడు. అతని శతకంతో సొంతగడ్డపై రోహిత్ శర్మ అండ్ కో ప్రపంచకప్ ట్రోఫీని చేజార్చుకుంది. ఇక రెండోవది.. అదే ఏడాది జూన్‌గిన 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్. డబ్ల్యూటీసీ  ఫైనల్లోనూ అతడే అడ్డుపడ్డాడు. ఆ మ్యాచ్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఏకంగా 163 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Also Read :- కేకేఆర్ కెప్టెన్‌గా భారత వెటరన్ ప్లేయర్

హెడ్‌కు భారత్‌పై అద్భుతమైన వన్డే రికార్డు ఉంది. తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 43.12 సగటు, 101.76 స్ట్రైక్ రేట్‌తో 345 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా భారత్‌పై అతని సగటు 75.33. గత నాలుగు ఇన్నింగ్స్‌లలో 118.32 స్ట్రైకింగ్ రేట్‌తో 226 పరుగులు చేశాడు. ఇదే భారత అభిమానులను భయపెడుతోంది. దాంతో, ఏకంగా భారత జెర్సీ కలర్ మార్చేయమని సూచిస్తున్నారు.