
భారత దేశవాళీ దిగ్గజం, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్ (84) కన్నుమూశారు. ఆనారోగ్య సమస్యల కారణంగా సోమవారం(మార్చి 3) ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు.
ఇరవై ఏళ్లకు పైగా ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈయన, క్రికెట్‌లో తనదైన ముద్ర వేశారు. దేశవాళీ క్రికెట్‌లో 42 సార్లు ఐదు వికెట్లు, 13 సార్లు పది వికెట్ల ఘనత సాధించారు. శివాల్కర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ 1961లో ప్రారంభమైంది. ఆనాటి నుంచి 1988 సీజన్ వరకు ముంబై తరఫున జట్టుకే ఆడారు. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 589వికెట్లు పడగొట్టారు. ఇందులో ఘనత సాధించారు. అలాగే, 13 సార్లు పదివికెట్లు పడగొట్టి ఔరా అనిపించారు.
1972/73 రంజీ ట్రోఫీ సీజన్ ఫైనల్లో కేవలం 16 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టడం.. ఆయన కెరీర్‌లో ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇంత గొప్ప ప్రదర్శన కనబరిచినప్పటికీ, ఆయనకు ఏనాడూ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం రాలేదు. 2016లో ప్రతిష్టాత్మక సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఈయనను వరించింది.
భారత క్రికెటర్ల నివాళి
పద్మాకర్ శివాల్కర్ మరణం పట్ల భారత మాజీ క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన గౌరవార్థం భారత క్రికెటర్లు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో నల్లటి ఆర్మ్ బ్యాండ్లు ధరించి నివాళి అర్పించారు. అంతకుముందు బీసీసీఐ ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. దివంగత శ్రీ పద్మాకర్ శివల్కర్ గౌరవార్థం, టీమిండియా ఈరోజు నల్లటి చేతికి బ్యాండ్లు ధరించింది.." అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
In honour of the late Shri Padmakar Shivalkar, Team India is wearing black armbands today.
— BCCI (@BCCI) March 4, 2025