గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20తో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ఆటగాళ్లను పరిచయం చేసిన జట్టుగా అవతరించింది. ఇప్పటివరకూ 116 మంది ఆటగాళ్లు పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించగా.. భారత జట్టు దానిని అధిగమించింది.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో ఐపీఎల్ స్టార్లు మయాంక్ యాదవ్(LSG), నితీష్ రెడ్డి(SRH) భారత జట్టు తరుపున అరంగేట్రం చేశారు. వీరిద్దరూ వరుసగా దేశం తరపున ఆడిన 116వ, 117వ ఆటగాళ్లు అయ్యారు. తద్వారా పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక ఆటగాళ్లను అరంగేట్రం చేసిన పాకిస్థాన్ రికార్డును భారత జట్టు బద్దలు కొట్టింది. ఈ జాబితాలో 111 మంది ఆటగాళ్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉండగా.. శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకూ తమ టీ20 క్రికెట్ చరిత్రలో 100 మందికి పైగా ఆటగాళ్లను పరిచయం చేశాయి.
ALSO READ | Dipa Karmakar: తప్పుకుంటున్నా.. రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా జిమ్నాస్ట్
టీ20ల్లో అత్యధిక ఆటగాళ్లు అరంగేట్రం చేసిన జట్లు
- టీమిండియా: 117
- పాకిస్థాన్: 116
- ఆస్ట్రేలియా: 111
- శ్రీలంక: 108
- దక్షిణాఫ్రికా: 107
- ఇంగ్లండ్: 104
- న్యూజిలాండ్: 103