IND vs BAN: ఛేదిస్తారా! చేతులెత్తేస్తారా! భారత్ ముందు సాధారణ లక్ష్యం

IND vs BAN: ఛేదిస్తారా! చేతులెత్తేస్తారా! భారత్ ముందు సాధారణ లక్ష్యం

ఆసియా కప్‌ 2023లో భాగంగా భారత్‌తో జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. తడబడి నిలబడింది. మొదట పెవిలియన్ క్యూ కట్టిన బంగ్లా బ్యాటర్లు.. అనంతరం పుంజుకొని మంచి స్కోరు సాధించారు. ఆ జట్టు కెప్టెన్ షకీబ్‌ అల్ హసన్ (80; 85 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), తౌహిద్ (54; 81 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. దీంతో బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా తొలి ఆరు ఓవర్ల లోపే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. బంగ్లా ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌ డకౌట్‌గా వెనుదిరిగగా.. హసన్‌(13), అనముల్‌ హక్ (4) పరుగులకే పెవిలియన్ చేరారు. అలాంటి కాస్త సమయంలో బంగ్లాదేశ్‌ను షకీబ్ అల్ హసన్ (80), తౌహిద్ (54) ఆదుకున్నారు. చివర్లో నసుమ్ అహ్మద్ (44; 45 బంతుల్లో6 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా రాణించడంతో బంగ్లా గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, మహ్మద్‌ షమి 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ప్రసిద్ధ్‌ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Also Read :- 200 వికెట్ల క్లబ్ లో జడేజా..కపిల్ దేవ్ తర్వాత తొలి ప్లేయర్ గా ఘనత 

ఛేదిస్తారా! 

265 పరుగులు అంటే సాధారణ లక్ష్యమే అయినప్పటికీ.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చతికిల పడ్డ విషయం గమనించాల్సిందే. ఓపెనర్లుగా  రోహిత్, గిల్ ఉన్నప్పటికీ.. మిడిల్ ఆర్డర్ లో చెప్పుకోదగ్గ బ్యాటర్లు లేరు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా స్థానాలలో.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ జట్టులోకి వచ్చారు. వీరిపై ఎక్కువ నమ్మకాన్ని ఉంచలేం. మరికాసేపటిలో భారత ఇన్నింగ్స్ మొదలుకానుంది.